గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
ఉపాధ్యాయుల పీఆర్సీ, పెండింగ్ బిల్లుల పరిష్కారంపై ప్రభుత్వం ఇంకా తాత్సారం చేస్తే మరో ఉద్యమం చేపట్టక తప్పదని పీఆర్టీయూ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి హెచ్చరించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్‌లో మరింత ఉధృతంగా పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నల్లగొండలోని జీఎం గార్డెన్లో...
– పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్లో ప్రకటన
రామగిరి, అక్టోబర్ 15 : ఉపాధ్యాయుల పీఆర్సీ, పెండింగ్ బిల్లుల పరిష్కారంపై ప్రభుత్వం ఇంకా తాత్సారం చేస్తే మరో ఉద్యమం చేపట్టక తప్పదని పీఆర్టీయూ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి హెచ్చరించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్‌లో మరింత ఉధృతంగా పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నల్లగొండలోని జీఎం గార్డెన్లో గురువారం పీఆర్టీయూ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన ఆరో రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి సుమారు 6 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి తరలివచ్చిన ఉపాధ్యాయులతో నల్లగొండ పట్టణం పీఆర్టీయూ జెండాలతో సందడిగా మారింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లుల పరిష్కారం, అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు, ఈహెచ్ఎస్లో లోపాల సవరణ, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం శాసనమండలిలో పలుమార్లు తన గళాన్ని వినిపించానని తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టికి కూడా సమస్యలను తీసుకెళ్లినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 1న 35 వేల మంది ఉపాధ్యాయులతో ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించామని గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకపోతే తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
రాబోయే వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అధికారిక అభ్యర్థిగా రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్‌ను సమావేశంలో ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 15 ఏళ్లపాటు సంఘ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉందని నాయకులు తెలిపారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, నిరుద్యోగులు, విద్యావంతుల సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు మరో ఉద్యమ గొంతుక అవసరమనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థిగా తనను ప్రకటించిన ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డికి, రాష్ట్ర సంఘ నాయకత్వానికి సుంకరి భిక్షంగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యావంతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులనే ప్రస్తుత ప్రభుత్వం కూడా పునరావృతం చేస్తోందని విమర్శిస్తూ, ప్రజాసమస్యలపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 72 వేల మంది సభ్యత్వం కలిగిన ఏకైక ఉపాధ్యాయ సంఘంగా పీఆర్టీయూ నిలిచిందని తెలిపారు. సంఘం ఆవిర్భావం నుంచి ఉపాధ్యాయుల అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేసిందని, భవిష్యత్తులోనూ అదే స్ఫూర్తితో పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ అధికార ప్రతినిధి వంగ మహేందర్‌రెడ్డి, క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షులు పేరి వెంకటరెడ్డి, గుండు లక్ష్మణ్, జగన్మోహన్ గుప్తా, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కాళం నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, అద్దంకి సునీల్, రోలకలు నాగయ్య తదితరులు పాల్గొన్నారు. 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

