యాదగిరిగుట్ట, జనవరి 29 : యాదగిరిగుట్ట వాసిని స్టార్ ఐకాన్ అవార్డు వరించింది. పట్టణానికి చెందిన కాంటేకర్ పవన్‌కుమార్ సమాజ సేవలో చేసిన కృషికి గాను హైదరాబాద్‌కు చెందిన సుమన్ ఆర్ట్ థియేటర్స్ సంస్థ గుర్తించి స్టార్ ఐకాన్ అవార్డును ప్రకటించింది.
ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, ఎమ్మెల్సీ సిరికొండ సత్యనారాయణ చేతులమీదుగా అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ సుమన్ ఆర్ట్ థియేటర్స్ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.