నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 18 : క్రీడలు మానసిక ప్రశాంతతకు, శారీర దారుఢ్యానికి దోహద పడతాయని, పాఠశాల స్థాయిలోనే క్రీడలను అలవర్చుకోవాలని నల్లగొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముస్తాక్ అహ్మద్ అన్నారు. గురువారం ఎస్జీఎఫ్ నల్లగొండ నియోజకవర్గ స్థాయి అండర్ -14, అండర్ -17 బాల బాలికల కబడ్డీ, కో కో, వాలీబాల్ క్రీడా పోటీలను స్థానిక కేపీఎం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ క్రీడోత్సవాలు నల్లగొండ ఎంఈఓ కత్తుల అరుంధతి ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ హాజరై మాట్లాడారు. క్రీడల పట్ల విద్యార్థులు మక్కువ పెంచుకోవాలన్నారు.
క్రీడలు ఆరోగ్యానికి, ఆనందానికి ఎంతో దోహద పడతాయన్నారు. జీవితంలో స్థిర పడాలన్నా, ఉద్యోగాలు సంపాదించాలన్నా, భవిష్యత్లో స్పోర్ట్స్ కోటా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కాలేజీ ట్రస్ట్ సీఈఓ గోన రెడ్డి, తాసీల్దార్ పరశురాం, ఎంపీడీఓ యాకూబ్, హెచ్డీఎఫ్ సెక్రెటరీ నల్లగొండ విమల, తిప్పర్తి ఎంఈఓ నరసింహ నాయక్, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ రాక్ అండ్ ఏజీఎఫ్ కన్వీనర్ వీసం రాజు, రామ్మోహన్, ఫయాజ్, కుంభం రామ్ నర్సిరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Nalgonda Rural : క్రీడలు మానసిక, శారీరక దారుఢ్యానికి దోహదం : సయ్యద్ ముస్తాక్ అహ్మద్
Nalgonda Rural : క్రీడలు మానసిక, శారీరక దారుఢ్యానికి దోహదం : సయ్యద్ ముస్తాక్ అహ్మద్