చివ్వెంల, ఏప్రిల్ 03 : ప్రతి ఒక్కరూ సామాజిక సేవా దృక్పథం కలిగి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని బండమీడి చందుపట్ల ప్రాథమిక పాఠశాలలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి, అరుణకుమారి దంపతుల మనుమడు బత్తి ప్రకేత్ రెడ్డి (USA) జన్మదినం సందర్భంగా 105 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేయగా పంపిణీ చేసి మాట్లాడారు.
పేద విద్యార్థుల చదువులకు నోట్ పుస్తకాలతో పాటు, పెన్నులు, ఇతర స్టేషనరీ సామాగ్రి అందించడం అభినందనీయం అన్నారు. పిల్లలపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు పిచ్చిరెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నవీన్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.