కోదాడ : విద్యుత్ కోతల ( Power outages ) వల్ల చేతికొచ్చిన వరి పైర్లు ఎండిపోతున్నాయని ఆగ్రహిస్తూ కోదాడ విద్యుత్ సబ్‌స్టేషన్ ( Sub Station ) ఎదుట బుధవారం అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ ( Bollu Prasad ) నాయకత్వంలో రైతులు సబ్‌స్టేషన్ ముందు ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడాపెడా విద్యుత్ కోతలు విధించడం వల్ల పొలాలకు నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. విద్యుత్ కోతల కారణంగా ఎండిపోయిన పంటలకు ఎకరాకు 30 వేలచొప్పున పరిహారం చెల్లించాలని, అలాగే పంటలను కాపాడేందుకు వెంటనే 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
అధికారులు స్పందించకుంటే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ధరానలో రైతులు కమతం వెంకటరావు, కుటుంబరావు, సైదయ్య, సామినేని సుబ్బారావు, సతీష్, నగేష్, కనగాల పూర్ణ, కొండయ్య, నాగుల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.