లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం : ఎంఈఓ అంబటి అంజయ్య
లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. బుధవారం మండలంలోని యరసానిగూడెం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ నోబుల్ ఆధ్వర్యంలో రూ.25 వేల విలువైన క్రీడా దుస్తులు, షూలను విద్యార్థులకు అందజేశారు.
కట్టంగూర్, ఫిబ్రవరి 18 : లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. బుధవారం మండలంలోని యరసానిగూడెం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ నోబుల్ ఆధ్వర్యంలో రూ.25 వేల విలువైన క్రీడా దుస్తులు, షూలను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం ద్వారా వారి ప్రతిభను వెలికితీయచ్చన్నారు. పేద విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలను లయన్స్ క్లబ్ వారు దాతృత్వ సేవలకు ఎంపిక చేసుకోవడం సంతోషకరమని అన్నారు. విద్యార్థులు దాతలు అందే సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
విద్యార్థుల తల్లిదండ్రులు మెరుగైన విద్యనందించే ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి పాఠశాలల బలోపేతానికి సహకరించాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింతల యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆకటి శంకర్, లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ నోబుల్ అధ్యక్షుడు తంతెనపల్లి సైదులు, సభ్యులు, దాతలు ముప్పిడి మల్లయ్య, యాపాల బాపిరెడ్డి, మోహన్ రెడ్డి, కొమ్మనబోయిన మారయ్య, కరుణాకర్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కొరివి యాదమ్మ, ఉపాధ్యాయులు గాలి సంధ్యారాణి, శ్రీనివాస్, తరాల పరమేశ్ యాదవ్, జానపాటి శంకర్, వార్డు రామచంద్రు, పులకరం నాగరాజు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

