దేవరకొండ రూరల్, మే 11 : రమావత్ కనిలాల్ నాయక్ ప్రభుత్వ ఉద్యోగిగా, ప్రజాప్రతినిధిగా ఎనలేని సేవలు చేశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ తండ్రి కనిలాల్ నాయక్ ప్రథమ వర్ధంతి సందర్భంగా మండలంలోని శేరిపల్లి గ్రామంలో ఆదివారం ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కనిలాల్ విగ్రహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు. అనంతరం రవీంద్రకుమార్ మాట్లాడుతూ తమ తండ్రి నుంచి క్రమశిక్షణ, ప్రజాసేవ వంటి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు.
ప్రజాప్రతినిధిగా ప్రజాసేవ చేస్తూ గుర్తింపు తెచ్చుకోవడానికి తమ నాన్నే ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పల్లా ప్రవీణ్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.