నల్లగొండ రూరల్, ఏప్రిల్ 14 : సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో మే 3వ తేదీన నల్లగొండలో నిర్వహించనున్న “నల్లగొండ ప్రోమో రన్” లో ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సొసైటీ జనరల్ సెక్రటరీ మగ్గరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో మంగళవారం రన్ పోస్టర్ విడుదల చేశారు. రన్నింగ్, ఫిట్నెస్ ప్రాధాన్యతను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం, అలాగే జూన్ 7న హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ వద్ద జరగనున్న అవంతికా తెలంగాణ రన్ 2026 కార్యక్రమాన్ని తెలంగాణ అంతటా విస్తరించేందుకు తెలంగాణ రన్ టూర్ లో రాష్ట్రంలోని పలు నగరాల్లో ఇలాంటి ప్రోమో రన్స్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమానికి నల్లగొండ వాకర్స్ అసోసియేషన్ కమ్యూనిటీ పార్ట్నర్గా భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని, మరింత మంది రన్నర్స్ర, ఫిట్నెస్ ప్రేమికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ తరఫున రాఘవ్ సంకోజు పాల్గొన్నారు. అలాగే నల్లగొండ వాకర్స్ అసోసియేషన్ తరఫున బండారు ప్రసాద్, డా. పుల్లారావ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ (మాజీ ) శౌరయ్య , బీమార్జున్ రెడ్డి, కట్టా వెంకటరెడ్డి, గుర్రం వెంకన్న, చింతపల్లి వెంకన్న, శంభు, పవన్, భావన, శ్రీనివాస్‌రావు, కీసరి శ్రీనివాస రెడ్డి, భజరంగ్ పాల్గొన్నారు. రన్ రిజిస్ట్రేషన్ ఈ నెల 25న ముగుస్తుంది కాబట్టి ఔత్సాహికులు తమ పేర్లను నమోదు చేసుకుని విజయవంతం చేయాలని అసోసియేషన్ సభ్యులు కోరారు.