ప్రైవేట్ ట్రావెల్స్ బోల్తా
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిట్యాల మండలంలోని వట్టిమర్తి స్టేజీ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది.
- 9 మందికి తీవ్ర గాయాలు
చిట్యాల, డిసెంబర్ 13 : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిట్యాల మండలంలోని వట్టిమర్తి స్టేజీ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. స్థానిక ఎస్ఐ ధర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు గుంటూరు నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్నది.
మంగళవారం తెల్లవారుజామున వట్టిమర్తి స్టేజీ వద్దకు చేరుకోగానే డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం కారణంగా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు 8 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు చికిత్స కోసం నార్కట్‌పల్లి కామినేని దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

