గుర్రంపోడు, మే 05 : పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో గుర్రంపోడు మండలంలోని పాల్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని మల్లోజు దీక్షిత 600 మార్కులకు గాను 562 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో 9వ స్థానంలో నిలిచింది. దీంతో మంగళవారం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, డీఈఓ భిక్షపతి చేతుల మీదుగా విద్యార్థిని ప్రతిభా పురస్కారం అందుకుంది. జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ విద్యార్థిని శాలువాతో సన్మానించి, ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నోముల యాదగిరి, ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.