దేవరకొండ రూరల్, అక్టోబర్ 08 : దేవరకొండ విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని 132 ఫర్ 33 కెవి అత్యవసర మరమ్మతు పనుల కోసం శుక్రవారం మధ్యాహ్నం అంతరాయం ఏర్పడనున్నట్లు విద్యుత్ శాఖ ఏడీఈ శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగునున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ, గృహ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకుగాను దేవరకొండ డివిజన్ పరిధిలో రైతులకు శుక్రవారం ఉదయం 4 గంటల నుండి త్రీఫేస్ కరెంటు సరఫరాను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మార్పును సబ్ స్టేషన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులైన రైతులు, గృహ వినియోగదారులు గమనించి శాఖాపరంగా చేపడుతున్న ఈ మరమ్మతులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.