– నియోజకవర్గంలో శాంతిభద్రతల కరవు
– సెటిల్మెంట్లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు
– ఎమ్మెల్యే కను సన్నలలోనే అక్రమ వసూళ్లు
– వసూల్ రాజాపై చర్యలు తీసుకోవాల్సిందే
– ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్
కోదాడ, ఆగస్టు 21 : కోదాడ నియోజకవర్గంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, ఇసుక మట్టి గంజాయి ఆర్థిక నేరాలకు అడ్డగా మారిందని, పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. శాంతి భద్రతల కరవకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి కోదాడ గాంధీ విగ్రహం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోలీస్ స్టేషన్లో ఆర్థిక దందాలకు సెటిల్మెంట్లకు అడ్డాగా మారాయిని తీవ్రంగా విమర్శించారు. అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్కు రప్పించి బాధితుల నుండి డబ్బులు గుంజుతున్నట్టు బాధితులు బహిరంగంగానే తమ గోడును వెళ్ళబోసుకుంటున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల అండతోఅక్రమ ఇసుక మట్టి దంద ఇష్ట రాజ్యాంగా కొనసాగుతున్నప్పటికీ రెవెన్యూ పోలీసు వ్యవస్థ చూడనట్టు వ్యవహరించడం వెనక ఆంతర్యం ఏమిటో అందరికీ తెలిసిందే అన్నారు.
దీంతోపాటు కోదాడ మున్సిపాలిటీ లో పాలకవర్గం లేని సందర్భంలో అధికారులు కమీషన్ల పేరిట లక్షల దండుకున్నట్లు ఆధారాలున్నప్పటికీ ఆమెపై చర్యలు తీసుకోకపోవడం దారుణం అన్నారు. ఎమ్మెల్యే కను సన్నలలోనే ఈ అక్రమ దందాలు కొనసాగుతున్నాయని, లేనట్లయితే వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పోలీస్ కస్టడీలో దళిత బిడ్డ కర్ల రాజేష్ దుర్మరణం పాలై సంవత్సరం గడుస్తున్నప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకోపోవటం వెనుక అధికార పార్టీ నాయకుల వత్తిడి ఉన్నట్టు స్పష్టంగా కనబడుతుంది అన్నారు.. పశువుల అక్రమ రవాణాలో కేసులు లేకుండా చేస్తానని నిందితుడి నుండి రూ.18 లక్షలు స్వాహా చేసిన చోటా అధికార పార్టీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలన్నారు.. ఇక పట్టణంలో శాంతిభద్రతలు దయనీయంగా ఉన్నాయని, దొంగతనాలు జరుగుతున్నప్పటికీ చర్యలు లేవని విమర్శించారు. ఏకంగా బస్టాండ్ ఎదుటి మేడం కత్తితో పొడిచి చంపటం, గంజాయి విక్రయం కేసులో నిందితుడు పట్టణ పోలీస్ స్టేషన్ నుంచే తప్పించుకోవటం వారి బాధ్యత రాహిత్యాన్ని స్పష్టం చేస్తుందన్నారు.
గంజాయి దందాను నిర్వహించడంలో శాంతి భద్రతల పరిరక్షణలో పట్టణ పోలీసులు విఫలమయ్యారని, తక్షణమే పట్టణ సిఐని ఇక్కడి నుండి బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. కోదాడ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు. ఇసుక మట్టి గంజాయి మాఫియా అధికార పార్టీ నాయకుల సెటిల్మెంట్లు తదితర దందాలపై టాస్క్ ఫోర్స్ అధికారులచే సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. చర్యలు తీసుకోకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్ కౌన్సిలర్ నరేష్ ఉపేందర్ గౌడ్ పిట్టల భాగ్యమ్మ కరీముల్లా బాబా ముఖ్య నాయకులు పాల్గొన్నారు