కట్టంగూర్, మే 07 : టీఎమ్మార్పీఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామానికి చెందిన ఊట్కూరి కృష్ణ నియమితులయ్యాడు. తెలంగాణ మహానీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటుక రాజు, తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నిరసనోళ్ల బాలరాజు ఆదేశాల మేరకు బుధవారం నల్లగొండలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో కృష్ణతో పాటు జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు యడవల్లి మధుబాబు కృష్ణకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా టీఎమ్మార్పీఎస్ను బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. నియామకానికి సహకరించిన మండల, జిల్లా కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.