బీఆర్ఎస్లో బీఆర్ఎస్ జోష్
ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్లో ఫుల్ జోష్ కనిపిస్తున్నది. ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధమేనంటూ కదన కుతుహలంతో ముందుకు సాగుతున్నది.
- మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పర్యటనలతో సమరోత్సాహం
- నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల జాతర
- నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఎమ్మెల్యేలు
- పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల నుంచి వలసలు
- కదన కుతూహలంతో గులాబీ శ్రేణులు
- ఎన్నికలెప్పుడొచ్చినా సై అంటున్న బీఆర్ఎస్
- అభ్యర్థుల వెతుకులాటలో విపక్షాలు, ఆయా పార్టీల శ్రేణుల్లో నైరాశ్యం
ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్లో ఫుల్ జోష్ కనిపిస్తున్నది. ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధమేనంటూ కదన కుతుహలంతో ముందుకు సాగుతున్నది. ఓ వైపు అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళుతూనే మరోవైపు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నది. కాంగ్రెస్, బీజేపీ లాంటి విపక్షాలు తేల్చుకోలేని గందరగోళ పరిస్థితుల్లో ఉండగా ఆ పార్టీల శ్రేణులుతీవ్రనైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ సర్కారు చేస్తున్న అభివృద్ధితోపాటు బీఆర్ఎస్ అనుసరిస్తున్న స్పష్టమైన వ్యూహం ఇతర పార్టీ శ్రేణులను ఆలోచింపచేస్తున్నది. దీంతో పెద్ద సంఖ్యలో నిత్యం బీఆర్ఎస్లోకి వలసలు వెల్లువలా కొనసాగుతున్నాయి.
వీటికి తోడు గత వారం రోజులుగా జిల్లాలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల పర్యటనలు గులాబీ శ్రేణుల్లో మరింత ఉత్తేజాన్ని నింపాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి సక్సెస్ చేయడం విశేషం. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఉద్ధండులుగా చెప్పుకునే నేతలంతా 60 ఏండ్లుగా జిల్లాకు చేసిందేమీ లేదని, ఇక ముందు కూడా వాళ్లతో ఒరిగేదేమీ లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారుతోనే నల్లగొండ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందంటూ లెక్కలతో వివరించారు. అభివృద్ధి కొనసాగాలన్నా, మరింత మెరుగైన కార్యక్రమాలు జరుగాలన్నా బీఆర్ఎస్ సర్కారుతోనేసాధ్యమని ప్రజలకు స్పష్టం చేశారు.
జోష్ నింపిన మంత్రుల పర్యటనలు
గత వారం రోజుల్లోనే నాలుగు నియోజకవర్గాల్లో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పర్యటనలు పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపాయి. గత నెల 29న మంత్రి హరీశ్‌రావు, జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ నియోజకవర్గాల ప్రగతి నివేదన సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ఎండగడుతూ.. కేసీఆర్ వచ్చాక జరిగిన అభివృద్ధిని వివరించారు.
మిషన్ కాకతీయలో బాగైన చెరువులు.. మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా నాణ్యమైన కరెంటు, సరిపడా ఇస్తున్న ఎరువుల గురించి చెప్పారు. దీంతో తెలంగాణ రాష్ట్రం దేశానికి ధాన్యగారమైతే, నల్లగొండ రాష్ర్టానికి దండిగా ధాన్యం ఇస్తున్నదని తెలిపారు. కాంగ్రెసోళ్లకు పదవుల మీద, పైరవీల మీద ప్రేమ.. వాళ్ల కడుపు నింపుకొనే ఆలోచనల మీద ప్రేమ.. ప్రజల కోసం ఏ ఆలోచనా చేయరని ప్రజలకు వివరించి చెప్పారు. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి సోమవారం సూర్యాపేట, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో పర్యటించి సుమారు రూ.1450 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రోడ్‌షోలు నిర్వహించి ఐటీ హబ్‌లు ప్రారంభించగా ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. బహిరంగ సభకు వేలాదిగా తరలివచ్చారు. ‘తెలంగాణ రాకపోతే ఈ పనులు అయ్యేవా..
కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇన్ని పనులు ఎన్నటికన్నా అవుతుండేనా? నల్లగొండ బాగుపడేనా.. దయచేసి గుండె మీద చేయి వేసి ఆలోచించాలి.’ అని మంత్రి కేటీఆర్ చేసిన విజ్ఞప్తికి ప్రజలు ఈలలు, కేకలతో స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసినా.. జిల్లాకు పరిశ్రమలు, ఐటీ హబ్, మెడికల్ కాలేజీలు తేలేదు. కరెంటు, సాగునీరు, తాగునీరు ఇవ్వకుండా సావగొట్టారని మండిపడ్డారు. ఇవ్వాళ ఊదరగొడుతూ.. ఉపన్యాసాలు ఇస్తున్నారని కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, సంక్షేమం, పట్టణ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, కరెంటు.. ఇలా ఏ రంగాన్ని చూసినా సీఎం కేసీఆర్ అద్భుత పాలన అందిస్తున్నారని చెప్పారు. ఇలా మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ పర్యటనలు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్తేజాన్ని నింపాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సత్తా చాటేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధమయ్యాయి.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ మరోసారి అన్ని అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నది. గత ఎన్నికల్లో 9 అసెంబ్లీ స్థానాల్లో గెలవగా.. ఉప ఎన్నికల్లో విజయంతో అది 12కు చేరింది. త్వరలో జరుగబోయే ఎన్నికల్లో సైతం మరోసారి నల్లగొండ గులాబీ గడ్డగా చాటి చెప్పేందుకు ఉవ్విళ్లూరుతున్నది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలనే గెలుపు గుర్రాలుగా భావిస్తూ వారికే మరోసారి అవకాశం కల్పిస్తూ అభ్యర్థులను ప్రకటించారు.
అప్పటి నుంచే పార్టీ అభ్యర్థులంతా నియోజకవర్గాల్లో మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సహకారంతో ఇప్పటికే నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇంకా మున్సిపాలిటీలు, గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను సైతం గుర్తిస్తూ వాటిని పూర్తి చేసే ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఆయా విభాగాల వారీగా సంబంధిత మంత్రులతో సంప్రదింపులు చేస్తూ రహదారులు, డ్రైనేజీలు, బ్రిడ్జిలు, కమ్యూనిటీ హాళ్లు.. ఇలా స్థానిక అవసరాల మేరకు నిధులను తీసుకొస్తున్నారు.
ఇప్పటికే పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు, కొత్తగా చేపట్టే పనులకు శంకుస్థాపనలు చేస్తూ ఎమ్మెల్యేలు బిజీబిజీగా కనిపిస్తున్నారు. వీటికి తోడు దళితబంధు, బీసీ బంధు, గృహలక్ష్మి వంటి సంక్షేమ పథకాల అమలుపైనా దృష్టి సారించారు. నియోజకవర్గంలో తమ మార్క్ అభివృద్ధిని చూపేలా ఎమ్మెల్యేలు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇవన్నీ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్తేజం నింపుతుండగా.. ఇతర పార్టీల శ్రేణులు సైతం ఆలోచనల్లో పడేలా చేస్తున్నాయి. దీంతో ఇతర పార్టీల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరికలు జరుగుతున్నాయి.
బీఆర్ఎస్లోకి వలసల వెల్లువ
బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన అనంతరం ఇతర పార్టీల నుంచి భారీగా వలసలు జరుగుతున్నాయి. కేసీఆర్ సర్కార్ చేసిన అభివృద్ధి పనులతో పాటు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో కాంగ్రెస్, బీజేపీ నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. కొన్ని చోట్ల మరో పార్టీ లేకుండా ఊరంతా బీఆర్ఎస్ వైపే వస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన నేతలతోపాటు క్రియాశీలక కార్యకర్తలు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారు. పార్టీ విధానంపైనా బీఆర్ఎస్లో ఉన్నంత స్పష్టత ఇతర ఏ పార్టీలో లేకపోవడంతోనూ సమర్థవంతమైన పార్టీగా భావిస్తూ చేరుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలు నేటికీ తమ అభ్యర్థులను తేల్చుకోలేకపోతున్నాయి. దీనికితోడు ఉన్న నేతల్లోనూ నిత్యం తగదాలే కనిపిస్తున్నాయి. దీంతో ఎవరికి టిక్కెట్టు వస్తుందో..
ఎవరికి రాదో తెలువని గందరగోళ పరిస్థితుల్లో విపక్షాలు ఉన్నాయి. బీఆర్ఎస్ కాదనుకున్న నేతలను చేర్చుకునే ప్రయత్నాలను కూడా కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇన్నాళ్లు పార్టీ కోసం అన్ని విధాలుగా త్యాగాలు చేస్తూ వస్తే.. ఇప్పుడు వేరే వాళ్లకు టిక్కెట్ ఎలా ఇస్తారన్న ఆవేదనతో రగిలిపోతున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఆయా పార్టీల అధిష్టానాల తీరుపైనా, స్థానికంగా పార్టీలోని పరిణామాలపైనా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమక్షంలో నిత్యం భారీగా చేరికలు జరుగుతున్నాయి. గులాబీ పార్టీ మరింత బలోపేతంగా రూపుదిద్దుకుంటున్నది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

