రామగిరి: ప్రతి దేవాలయంలో ఎంపీ జోగుపల్లి సంతోష్‌కుమార్ గ్రీన్ ఛాలెంజ్‌తో జమ్మి వృక్షం నాటడం శుభ సూచికమని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, తెలంగాణ టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా అన్నారు. నల్లగొండలోని రామగిరి సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆవరణలో జమ్మివృక్షం నాటారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఇదంతా సీఎం కేసీఆర్ ముంద చూపుకు నిదర్శనమన్నారు. ఎక్కడైతే వృక్షాలు బాగా ఉంటాయో అక్కడ వర్షాలు సంవృద్ధిగా వస్తా యని, మొక్కలు బాగాపెరిగి అవుల శాతం పెరుగుతుందన్నారు. దీంతో పర్యావరణ కాలుష్య నియంత్రణ జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, రామాలయం చైర్మన్ చకిలం వేణుగోపాల్‌రావు, టీఆర్ఎస్ పట్టణా ధ్యక్షుడు పిల్లి రామరాజు, టీఆర్ఎస్ నాయకులు బకరం వెంకన్న, ఆలయ అర్చకులు శఠగోపాచార్యులు, ఇంటర్నేషనల్ ఆర్య వైశ్య ఫేడరేషన్ సభ్యులు ఎల్వీ కుమార్, వెంకటరమణ, కోటగిరి రామకృష్ణ, కాసం శేఖర్, పారేపల్లి శ్రీనివాస్, ఆలయ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.