నల్లగొండ రూరల్, జనవరి 12 : ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 15 నుంచి 17 వరకు జరిగే 45వ రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ చాంపియన్షిప్ పోటీలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా బాలికల జట్టును ఎంపిక చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఎంపిక పోటీలను జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి మక్బూల్ అహ్మద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హ్యాండ్ బాల్ క్రీడకు మంచి ఆదరణ ఉందన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం రాష్ట్ర జట్టుకు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య, ఎండీ ఉస్మాన్, కోచ్లు గుప్తా, రామాంజనేయులు, వరమ్మ, వరుణ్, మహేశ్, రామకృష్ణ, సాయిలు పాల్గొన్నారు.