నీలగిరి, అక్టోబర్ 22 : రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా, సామాజిక బాధ్యతగా రోడ్డుకు అడ్డంగా పడిపోయిన ట్రాఫిక్ బారీకేడ్లను సక్రమంగా పెట్టిన యుపకులను బుధవారం తన చాంబర్లో నల్లగొండ డీఎస్సీ కొలను శివరాంరెడ్డి అభినందించి శాలువాలతో సత్కరించారు. మంగళవారం రాత్రి నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో గల ఎస్సీ ఆఫీసు వద్ద గాలికి అడ్డంగా పడి ఉన్న బ్యారికేడ్లను గమనించి అటుగా వెళ్తున్న యువకులు కంభంపాటి రాకేశ్, చంద్రగిరి క్రాంతికుమార్, భాషపాక శ్రవణ్ ఇతర వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా బారీకేడ్లను సరిచేసి వాటిని యథాస్థానంలో పెట్టారు. ట్రాఫిక్ పోలీస్‌కి వారు రాత్రి సమయంలో సహాయం చేయడాన్ని సీసీ టీవీ కెమెరాలో గమనించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు యువకులను డీఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ మహా లక్ష్మయ్య, నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.