Nakrekal: అభివృద్ధిని చూసి టీఆర్‌స్‌లో చేరికలు.. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

కేతేపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులు టీఆర్ఎస్లో భారీ గా చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం గుడివాడ గ్రామానికి చెందిన సుమారు 150 మంది కాంగ్రెస్, సీపీఎం పార్టీల కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి వారిని టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యత ఇస్తానన్నారు. పార్టీని మరితం పటిష్ఠం చేసేందుకు గ్రామ స్థాయి కార్యకర్త లు క్రమశిక్షణతో పని చేయాలన్నారు. గ్రామ సర్పంచ్ కట్టా శ్రవణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో
టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం వెంకట్‌రెడ్డి, చిముట వెంకన్నయాదవ్, సర్పంచ్‌లు శ్రీనివా స్‌యాదవ్, బచ్చు జానకిరాములు, ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ సైదులుగౌడ్, నాయకులు ప్రదీప్ రెడ్డి, చల్ల కృష్ణారెడ్డి, షేక్ రషీద్, చేతన్, సుధాకర్, సత్యనారాయణ గౌడ్, ధన్‌రాజ్, వెంకట్‌రెడ్డి, భద్రయ్య, పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో కదిరె యాదయ్య, లింగయ్య, శ్రవన్, మహేశ్, నాగయ్య, జానయ్య, భిక్షం, తదితరులు ఉన్నారు.

Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాశ్
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

