నోముల.. కొలువుల మేళా
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ పాలనలోనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు.
- నోముల ఎన్ఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హాలియాలో ఏర్పాటు హాజరైన 1500 మంది యువతీ, యువకులు
- 20 కంపెనీల ద్వారా 700 మందికి ఉద్యోగాలు
- ప్రభుత్వ సహాయంతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా : ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
హాలియా, సెప్టెంబర్ 16 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ పాలనలోనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. నియోజకవర్గంలోని యువతకు ఎల్లవేళలా అండగా ఉంటూ ప్రభుత్వ సాయంతో నోముల ఎన్ఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. హాలియాలోని లక్ష్మీనర్సింహ గార్డెన్లో ప్లేస్మెంట్ ఫర్ లోకల్ యూత్ పేరుతో నోముల ఎన్ఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు నైపుణ్యం కలిగి ఉండాలని, అప్పుడే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే వందలాది పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. తొమ్మిదిన్నరేండ్లలో ప్రభుత్వ శాఖల్లో లక్షా 20వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించడంతోపాటు ఐటీ, ఫార్మా కంపెనీల్లో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్, రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పారిశ్రామిక విధానంతో రాష్ర్టానికి వేలాదిగా ఐటీ, ఇతర పరిశ్రమలు వచ్చాయని చెప్పారు.
తాను కూడా ఇంజినీరింగ్ పూర్తి చేసిన తరువాత ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసినట్లు తెలిపారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత ఏడాది జాబ్‌మేళా నిర్వహించి 890 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. చదువుకున్న యువతకు అండగా ఉంటానని హామీఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, హాలియా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జవ్వాజి వెంకటేశ్వర్లు, ప్లేస్మెంట్ డైరెక్టర్ ప్రదీప్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ మెరుగు రామలింగయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు ప్రసాద్‌నాయక్, నల్లబోతు వెంకటయ్య, ఎంపీటీసీలు ఉర్లగొండ వెంకటయ్య, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు, నాయకులు బొల్లం రవి, సురభి రాంబాబు, పొదిల శ్రీను, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
700 మందికి ఉద్యోగ అవకాశాలు
మెగా జాబ్‌మేళాకు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి 1500 మంది యువతీ యువకులు హాజరయ్యారు. జాబ్‌మేళాకు వచ్చిన 20 కంపెనీల ప్రతినిధులు వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన 700మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. వారికి రూ.15వేల నుంచి 35వేల వేతనం అందించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
నాకు ఉద్యోగం కల్పించిన ఎమ్మెల్యేకు రుణపడి ఉంటా
హాలియాలో ఏర్పాటు చేసిన జాబ్‌మేళాకు వచ్చి పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నా. నాకు ప్రీమియర్ హెల్త్‌కేర్‌లో జాబ్ వచ్చింది. నాతోపాటు మరో 700 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయి. నాకు జాబ్ ఇప్పించినందుకు ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్‌కు, బీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటా.
– పోతుగంటి స్వాతి, గుంటిపల్లి గ్రామం, నిడమనూరు మండలం
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

