రాగాలు పలుకుతున్న నగారా బండ
ఆ రాళ్లను మీటితే రాగాలు పలుకుతున్నాయి. వినసొంపైన శబ్దాలతో ఆశ్చర్య పరుస్తున్నాయి. ఆ రాయిని దేనితో కొట్టినా కంచులా మోగుతున్నది. లయబద్ధంగా మీటితే రాగాలు పలుకుతున్నది చండూరు మండలంలోని లక్కినేనిగూడెం గ్రామ శివారులో ఉన్న నగారా బండ
- బండను మీటితే వినసొంపైన శబ్దాలు
చండూరు, జనవరి 3 : ఆ రాళ్లను మీటితే రాగాలు పలుకుతున్నాయి. వినసొంపైన శబ్దాలతో ఆశ్చర్య పరుస్తున్నాయి. ఆ రాయిని దేనితో కొట్టినా కంచులా మోగుతున్నది. లయబద్ధంగా మీటితే రాగాలు పలుకుతున్నది చండూరు మండలంలోని లక్కినేనిగూడెం గ్రామ శివారులో ఉన్న నగారా బండ. స్థానికులు నిత్యం అక్కడికి వెళ్లి రాయిని కొడుతూ వాటి నుంచి వచ్చే శబ్దాలను ఆస్వాదిస్తున్నారు.
లక్కినేనిగూడెం గ్రామ శివారులో పూర్వం నుంచి ఒక పెద్ద బండరాయి ఉంది. కొన్నేండ్ల క్రితమే ఈ రాయి విశిష్టతను గుర్తించిన గ్రామస్తులు నగారా (ధ్వనించే) బండగా నామకరణం చేశారు. మూడెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో బండ మధ్యలో పెద్ద గుండు ఉన్నది. దానిని ఆనుకొని మరో గుండు రాయి ఉంది. ఈ గుండురాయిని మోదితే అచ్చు కంచు మోగినట్లు శబ్దం వస్తున్నది. రాయి నుంచి వచ్చే సంగీత ధ్వనులను స్థానికులు నిత్యం ఆస్వాదిస్తున్నారు.
విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆహ్లాదం కోసం ఇక్కడికి వస్తుంటారు. చండూరు పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బండ వద్దకు డాన్‌బోస్కో జూనియర్ కళాశాల మీదుగా, లక్కినేనిగూడేనికి వెళ్లే రోడ్డుగుండా రెండు మార్గాల్లో చేరుకోవచ్చు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దితే పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇక్కడికి వెళ్లే మట్టి దారిని బీటీగా మార్చాలని, రోడ్డు వెంట కంపచెట్లు తొలగించాలంటున్నారు. మున్సిపాలిటీ అధికారులు దృష్టి సారించి పార్కు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
బోరు కొడితే బండ వద్దకు వస్తా..
నా చిన్నతనం నుంచి నగారా బండ ప్రాంతం తెలుసు. ఇక్కడ బండరాయిని మీటితే కంచులాగా శబ్దం వస్తుంది. నేను, నా స్నేహితులు తరచూ ఇక్కడికి వస్తుంటాం. రాయితో లయబద్ధంగా కొడితే వచ్చే శబ్దాన్ని ఎంజాయ్ చేస్తాం. ఉదయం, సాయంత్రం వేళల్లో ఇక్కడ చాలా మంది వచ్చి సేద తీరుతుంటారు. రోడ్డు మార్గం మెరుగు పరిస్తే బాగుంటుంది.
– దాసరి స్వామి, లక్కినేనిగూడెం
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- Chanduru
- Found
- Music rocks
- Nalgonda
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

