శాలిగౌరారం, జూన్ 16 : జిల్లాలో పేరొందిన శాలిగౌరారం ప్రాజెక్టు నీటిని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఆదివారం కుడి కాల్వ గుండా లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయకట్టు రైతుల సంక్షేమం కోసం విడుదల చేసిన ప్రాజెక్టు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. ఆయకట్టు కింద 5వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నందున ప్రాజెక్టులో ఎప్పుడూ నీరు సమృద్ధిగా ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ ప్రాంత రైతాంగానికి శాలిగౌరారం ప్రాజెక్టు వరం లాంటిదని, ఏటా వానకాలం, యాసంగి రెండు పంటలు సాగు అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతు పక్షపాత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నదని తెలిపారు. అంతకుముందు సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఎర్ర రణీలా, స్థానిక ఎంపీటీసీ జోగు సైదమ్మ, నీటి పారుదల శాఖ ఈఈ విజయ్‌కుమార్, డీఈ సత్యనారాయణ, నూక కిరణ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, నాయకులు చాడ సురేశ్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, మహేందర్‌రెడ్డి, సుధాకర్, ఇంతియాజ్, శంకర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, జనార్దన్, ధనుంజయ, రమేశ్, శంకరయ్య పాల్గొన్నారు.