కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి సోమవారం 1102.92 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. దీంతో ప్రాజెక్టు ఒక గేటు ద్వారా 662.89 క్యూసెక్కులు, కాలువలకు 48.90 క్యూసెక్కులు వెళుతుంది.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 644.53 అడుగులుగా (4.34 టీఎంసీలు) ఉన్నట్లు అధికారులు తెలిపారు.