నకిరేకల్, మే 15 : నకిరేకల్ పట్టణ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం శంకుస్థాపన చేశారు. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 01, 04, 06, 12, 15, 18వ వార్డులో రూ.70 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో రూ.70 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. గతంలో అస్తవ్యస్తంగా ఉన్న పట్టణాన్ని నేడు సుందరంగా మార్చనున్నట్లు తెలిపారు.
రెండో విడుతలో నకిరేకల్ పట్టణంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపడుతామన్నారు. ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లలను మంజురు చేస్తామన్నారు. ప్రజా పాలనలో ప్రతి పేదవారికి న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చెవుగోని రజిత శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ నాగలవంచ వెంకటేశ్వరరావు, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, పీఆర్ డీఈ కొండయ్య, ఏఈ సంపత్, కౌన్సిలర్లు గాజుల సుకన్య శ్రీనివాస్, మట్టిపల్లి కవిత వీరు, యాసరపు లక్ష్మీ వెంకన్న, బానోతు వెంకన్న, కందాల భిక్షంరెడ్డి పాల్గొన్నారు.