నల్లగొండ : నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పానగల్ ఉదయ సముద్రం నుంచి D40 ద్వారా ఏఎమ్ఆర్పీ నీటిని యాసంగి పంటకు శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శాసనసభ్యుడిగా ఎన్నికైన తరువాత క్రమం తప్పకుండా కాలువ చివరి భూములకు కూడా నీటిని విడుదల చేయిస్తున్నామన్నారు.
రైతులు రైతులు కూడా నీటిని క్రమపద్ధతిలో వాడుకోవాలన్నారు. ఆరుతడి పంటలు వేసుకొని ప్రభుత్వానికి సహకరించి ఆర్థిక లబ్ధి పొందాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో తిప్పర్తి ఎంపీపీ నాగుల వంచ విజయలక్ష్మి, జిల్లా సహకార బ్యాంక్ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, తిప్పర్తి నల్లగొండ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు బకరం వెంకన్న, లోడంగి గోవర్ధన్, గాదె రాం రెడ్డి, తిప్పర్తి మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ ముత్తినేని శ్యామ్సుందర్, తిప్పర్తి వైస్ ఎంపీపీ ఏనుగు వెంకట్ రెడ్డి, కందుల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.