పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
సాగర్ నుంచి నీళ్లు సముద్రం పాలవుతున్న ఆయకట్టుకు నీళ్లులేవు. రాష్ట్ర మంత్రులు కట్ట మీద చర్చకు సిద్ధం కావాలి అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు.
నల్లగొండ : సాగర్ నుంచి నీళ్లు సముద్రం పాలవుతున్న ఆయకట్టుకు నీళ్లులేవు. రాష్ట్ర మంత్రులు కట్ట మీద చర్చకు సిద్ధం కావాలి అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. నల్గొండ పట్టణంలోని ఉదయ సముద్రం చెరువు వద్ద ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కృష్ణా బేసిన్లోకి పుష్కలంగా నీరు వచ్చి, సాగర్ గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని వదులుతున్నారు. కానీ, జిల్లాలో పూర్తి స్థాయిలో చెరువులు నింపకుండా, మేజర్ల కింద, డిస్ట్రిబ్యటరీల కింద నీళ్లు విడుదల చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం శారు.
దేవరకొండ, నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గంలో నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా మంత్రులు దద్దమ్మలని మరో సారి రుజువు అయింది. కోమటిరెడ్డి, ఉత్తమ్ ఇద్దరు అసమర్థులే అని మండిపడ్డారు. కేవలం కమీషన్లు, ఆర్భాటాలు తప్పితే ఈ మంత్రుల వల్ల జిల్లాకు ఒరిగింది ఏంలేదన్నారు. కనీసం నీళ్లు ఇవ్వలేని చేతకాని మంత్రులు వీళ్లు అని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఉదయసముద్రంమత్తడి దుంకేలా నీరు నింపాము. అన్ని చెరువులు నింపాము. ఇప్పుడు ఎందుకు నింపడం లేదని ప్రశ్నించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

