మిర్యాలగూడ, జనవరి 1 : రెడ్డి సంక్షేమ సంఘం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను సోమవారం పట్టణంలోని సంఘం కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డితో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెడ్డి సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి తనవంతు సహాయ, సహకారాలు అందిస్తానన్నారు. ఈ భవనంలో అన్ని వర్గాల వారికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేపట్టాలని సూచించారు. కౌన్సిలర్లు శాగ జయలక్ష్మి, వంగాల నిరంజన్‌రెడ్డి, నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, సంఘం అధ్యక్షుడు అనుముల మధుసూదన్‌రెడ్డి, చెన్నారెడ్డి, బుచ్చిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నరసింహారెడ్డి పాల్గొన్నారు.