ఆర్టీసీ బలోపేతానికి పటిష్ట చర్యలు
నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. నల్లగొండ డిపోలో నూతన ఏసీ బస్సుతోపాటు 4 డీలక్స్, పల్లె వెలుగు బస్సులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు.
- దసరా నాటికి ఉమ్మడి జిల్లాకు 30 డీలక్స్, 30 ఎక్స్‌ప్రెస్ బస్సులు
- నల్లగొండ నుంచి తిరుపతి, హైదరాబాద్‌కు ఏసీ బస్సులు
- మంత్రులు పొన్నం ప్రభాకర్‌గౌడ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ సిటీ, జూలై 13 : నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. నల్లగొండ డిపోలో నూతన ఏసీ బస్సుతోపాటు 4 డీలక్స్, పల్లె వెలుగు బస్సులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థను, కార్మికులను సంరక్షించేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోపే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని తెలిపారు. కొత్తగా వెయ్యి బస్సులు కొనుగోలు చేశామని, మరో 1500 సర్వీసులను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చామని చెప్పారు.
వచ్చే దసరా నాటికి జిల్లాకు 30 డీలక్స్, 30 ఎక్స్‌ప్రెస్ బస్సులను మంజూరు చేస్తామన్నారు. నల్లగొండ నుంచి హైదరాబాద్, తిరుపతికి ఏసీ బస్సులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఏడు డిపోల పరిధిలో 645 బస్సులు 2.55లక్షల కిలోమీటర్లు ప్రయాణించి 3లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయన్నారు. ఆర్టీసీలో 3,035 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ఏసీ బస్సులు నడుపాలని నిర్ణయం తీసుకున్నామని, అవసరమైతే అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రాజధానికి ఏసీ బస్సులను నడుపుతామని, ముందుగా జిల్లా కేంద్రాల నుంచి ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు.
నార్కట్‌పల్లి డిపోకు పునర్వైభవం తీసుకొచ్చి అక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు బస్సులను పునరుద్ధరించే చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీ కార్మికులకు 21శాతం డీఏ ఇచ్చామని, రూ.280 కోట్ల బకాయిలలో 80 కోట్ల రూపాయలు ఇది వరకే ఇచ్చామని, మిగిలిన రూ.200 కోట్లు ఈ నెల చివరి నాటికి వారి ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత అతి పెద్ద జిల్లా అయిన నల్లగొండకు 25 బస్సులతోపాటు నార్కట్‌పల్లి డిపోకు పునర్వైభవం తీసుకురావాలన్నారు. ఉమ్మడి జిల్లాకు వంద బస్సులు మంజూరు చేయాలని మంత్రి పొన్నంను కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పూర్ణచంద్రం, ఆర్టీసీ ఆర్ఎం రాజశేఖర్, డీఎం రామ్మోహన్‌రెడ్డి, డీవీఎం మాధవి, శివశంకర్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

