కోదాడ, జూలై 3: ‘ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డాయి. ఖరీఫ్‌లో రైతులు అప్రమతంగా ఉండాలి. తక్కువ నీటితో సాగయ్యే పంటలను సాగు చేయాలి. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో మంత్రి పర్యటించారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. మహారాష్ట్రంలో వర్షాలు తక్కువ పడుతున్నందున గోదావరి జలాల ప్రవాహం ఆలస్యమైయ్యే అవకాశం ఉందన్నారు. ఎండలను తట్టుకునే ప్రత్నామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు.
గరిడేపల్లి, జూలై 3: ‘నిరుపేద విద్యార్థులకు ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగిన విద్యను అం దించే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తున్నాం. ఈ పాఠశాల చరిత్రలో నిలిచిపోతుంది’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి శివారులో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను శుక్రవారం కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం మండలంలో పలు రోడ్లకు శంకుస్థాపన చేశారు. మరికొన్ని రోడ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, హుజూర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, గరిడేపల్లి ఇన్చార్జి తహసీల్దార్ స్రవంతి, హుజూర్నగర్ సీఐ చరమందరాజు, గరిడేపల్లి ఎస్ఐ శ్రీకాంత్, త్రిపురం అంజన్‌రెడ్డి, రంగనాథ్, బచ్చలకూరి శ్రీను, కడియాల పద్మ, గుండు రామాంజి గౌడ్ పాల్గొన్నారు.