నల్లగొండ, మే 23 : నల్లగొండ మారుతీ సుజుకి పవన్ మోటార్స్ నందు జన హృదయ నేత, తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాలు& సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలు పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోమటిరెడ్డి చంద్ర పవన్ రెడ్డి, సీసీఓ రవిరెడ్డి, జీఎం నాగమణి సుధాకర్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి చంద్ర పవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా అనేక రహదారులు వేయించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా నల్లగొండ ప్రజలకు సేవలు చేసిన వెంకట్రెడ్డి గారిని దేవుడు దీవించాలని, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మంచి చేయాలని ఆకాంక్షించారు. పవన్ మోటార్స్ ఉద్యోగస్తులు వేడుకల్లో పాల్గొని మంత్రికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.