కవర్ కట్టు.. లాభాలు పట్టు..
ఏటా ఎండాకాలంలో మామిడి కాయలు, పండ్లకు డిమాండ్ ఉంటుంది. పచ్చళ్లు పెట్టడంతోపాటు మామిడి పండ్లను తింటారు. సాధారణ మామిడి కాయలు టన్నుకు రూ.30 వేల నుంచి రూ.35వేల వరకు పలుకుతుండగా, మ్యాంగో ఫ్రూట్ ప్రొటెక్ట్ కవర్ తొడిగినవి టన్నుకు రూ.60వేల నుంచి రూ.70వేల వరకు పలుకుతుంది.
- మామిడికాయల సంరక్షణకు ప్రత్యేక సంచులు
- ఎండలు, వడగండ్ల నుంచి రక్షణ
- నాణ్యమైన దిగుబడులకు దోహదం
- తొడిగిన 75 రోజుల తర్వాత తొలగింపు
- మ్యాంగో ఫ్రూట్ ప్రొటెక్ట్ కవర్‌తో మంచి ఆదాయం
- ఆసక్తి చూపుతున్న రైతులు
- రైతులకు మంచి ఆదాయం
ఏటా ఎండాకాలంలో మామిడి కాయలు, పండ్లకు డిమాండ్ ఉంటుంది. పచ్చళ్లు పెట్టడంతోపాటు మామిడి పండ్లను తింటారు. సాధారణ మామిడి కాయలు టన్నుకు రూ.30 వేల నుంచి రూ.35వేల వరకు పలుకుతుండగా, మ్యాంగో ఫ్రూట్ ప్రొటెక్ట్ కవర్ తొడిగినవి టన్నుకు రూ.60వేల నుంచి రూ.70వేల వరకు పలుకుతుంది. సాధారణ మామిడి కాయలు కోసి మనమే రవాణా ఖర్చులు భరించి మార్కెట్‌కు తరలించాల్సి ఉంటుంది. కవర్ తొడిగిన మామిడికాయలను కార్పొరేట్ సంస్థలైన రిలయన్స్ ఫ్రెష్, మోర్, స్పెన్సర్ తదితర కంపెనీలు నేరుగా తోటల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నాయి. దీంతో రైతులకు రవాణా ఖర్చులు ఆదా అవుతున్నాయి.
ఆదాయం బాగుంది
ఏటా మామిడి తోటలకు పిందెలు ఉన్నప్పుడే గుత్తకు తీసుకుంటా. బయానా ఇవ్వగానే మ్యాంగో ఫ్రూట్ ప్రొటెక్ట్ కవర్లను తీసుకొస్తా. ఒక కవర్ కు రూ.2.50, మామిడికాయకు కట్టినందుకు రూపాయి అవుతుంది. మొత్తం ఒక్క కాయకు రూ.3.50 ఖర్చవుతుంది. ఫిబ్రవరిలో కాయలకు కవర్లు తొడుగుతాం. మే మొదటి వారంలో కాయలను తెంపుతా. కాయకు కవర్ కట్టడం వల్ల సాధారణ మామిడి కాయల కంటే 150 గ్రాముల బరువు అధికంగా వస్తుంది. కవర్ తొడగని కాయ 50 నుంచి 60 టన్నులు దిగుబడి వస్తే కవర్ తొడిగిన కాయలు 100 నుంచి 150 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది వడగండ్ల వాన వల్ల రాళ్లు పడి కాయలు రాలిపోయినప్పటికీ, కవర్ తొడిగిన కాయల వల్ల అధిక ఆదాయం వస్తుందనే భరోసా ఉంది.
– ఇస్మాయిల్, మామిడి రైతు, చిన్నగూడూరు
మామిడి రైతులు మ్యాంగో ఫ్రూట్ ప్రొటెక్ట్ కవర్ల వినియోగంతో మంచి లాభాలు పొందుతున్నారు. మామిడి కాయలకు పూర్తి రక్షణగా ఉండే ఈ కవర్లతో నాణ్యమైన దిగుబడి వచ్చి ఆదాయం రెండింతలు వస్తున్నది. సాధారణంగా మామిడి పిందె దశలోనే ఎక్కువగా దెబ్బతింటుంది. పురుగు ఆశించి లోపలి గుజ్జు తినడం వల్ల కాయ రాలిపోతుంది. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీన్ని అధిగమించేందుకు చెట్టుపై మామిడి పిందెలు పడగానే ప్రొటెక్ట్ కవర్లను తొడగాలి. మ్యాంగో ప్రొటెక్ట్ కవర్ బయట బ్రౌన్ కలర్, లోపల బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇవి అధిక ఎండ నుంచి రక్షణగా నిలుస్తాయి.
వడగండ్ల వాన కురిసినప్పుడు రాళ్లు పడినా కాయలు పాడవవు. కవర్ తొడిగిన 65 నుంచి 75 రోజుల తర్వాత కవర్ తొలగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎలాంటి మచ్చలు లేకుండా పసుపు రంగులో కాయలు నిగనిగలాడుతుంటాయి. మామిడి కాయలు పక్వానికి వచ్చేందుకు హీట్ యూనిట్ 585 గంటలు అవసరం. ఈ కవర్ ద్వారా కాయ రంగుతోపాటు బరువు కూడా పెరుగుతుంది. మ్యాంగో ప్రొటెక్ట్ కవర్ కట్టిన మామిడి కాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సాధారణ మామిడి కాయలతో పోల్చితే వీటి ధర రెండింతలు ఎక్కువ పలుకుతుంది. కిలోకు రూ.80 నుంచి 100 పలుకుతున్నది. ఇవి మానుకోట జిల్లా నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

