ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు అసిస్టెంట్ ప్రొ.ఆర్.మురళికి మేజర్ ధ్యాన్ చంద్ ఎక్సలెన్స్ అవార్డు
మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఆర్.మురళికి ఒలింపిక్స్ ప్రఖ్యాతిగాంచిన హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. తెలంగాణ మేథావుల ఫోరం ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దిన్సోతవం పురస్కరించుకుని అందించిన అవార్డుల్లో...
– ఎంజీయూ వీసీ, రిజిస్ట్రార్, సహాచర అధ్యాపకుల అభినందనలు
రామగిరి, ఆగస్టు 29 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఆర్.మురళికి ఒలింపిక్స్ ప్రఖ్యాతిగాంచిన హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. తెలంగాణ మేథావుల ఫోరం ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దిన్సోతవం పురస్కరించుకుని అందించిన అవార్డుల్లో రాష్ట్ర స్థాయిలో మురళి ఎంపికయ్యారు. శనివారం హైద్రాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంతో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.బాలకృష్ణారెడ్డి, తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డా.రాజ్ నారాయణ ముదిరాజ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కాగా మురళీ గత 18 సం.రాలుగా ఎంజీయూ, అనుబందంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాని కళాశాలలోని వందలాది మంది విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తయారు చేసి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడంతోపాటు వర్సిటీకి ఖ్యాతి తెప్పించడంలో కృషి చేశారు. అంతే కాకుండా తాను రాసిని పరిశోధన గ్రంథాలు జాతీయ, అంతార్జాతీయ సదస్సులో పరిశోధన పత్రాలను సమర్పించారు. అవార్డు అందుకున్న మురళిని ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ ఫ్రొ.ఆకుల రవి, స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్ మద్దిలేటి, సహచార అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్స్, విద్యార్థులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
గిరిజనతండా నుండి అంతర్జాతీయ స్థాయికి
మురళి అడవిదేవులపల్లి మండలం ఇందిరానగర్ గిరిజన తండాలో ప్రాథమిక విద్య అభ్యసించాడు. అనంతరం చలకుర్తి నవోదయాలో అటుపిమ్మట ఉస్మానియా యూనివర్సిటీ నుండి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ పట్టా పొందారు. పోలీస్ శాఖలో ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్పీఎఫ్ ఎంపికలో యూనివర్సిటీ విద్యార్థులకు ప్రోత్సాహంతో పోలీస్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యారు. దేశ, విదేశాలలో క్రీడలలో పరిశోధన పత్రాలను, క్రీడారంగంలో అంతర్జాతీయ, జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు.

ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు అసిస్టెంట్ ప్రొ.ఆర్.మురళికి మేజర్ ధ్యాన్ చంద్ ఎక్సలెన్స్ అవార్డు
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

