కొనుగోలు కేంద్రాల్లో దోపిడిని అరికట్టాలి : వి.కోటేశ్వర్ రావు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న దోపిడిని అరికట్టాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.కోటేశ్వర్ రావు అన్నారు. కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామంలో శనివారం బూరుగు అంజయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన..
కట్టంగూర్, మే 02 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న దోపిడిని అరికట్టాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.కోటేశ్వర్ రావు అన్నారు. కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామంలో శనివారం బూరుగు అంజయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. లారీల కొరతతో కొనుగోలు నిలిచిపోవడంతో ఎర్రని ఎండలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులకు పట్టింపు లేకుండా పోయిందని ఆవేవన వ్యక్తం చేశారు.
కేంద్రాల్లో కనీస సౌకర్యాలు నిర్వాహకులు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న మోదీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు జ్వాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి డేవిడ్ కుమార్, జిల్లా కార్యదర్శి అయిటి చిరంజీవి, ఉపాధ్యక్షులు గజ్జి రవి, వేముల శంకర్, సహాయ కార్యదర్శి అంబటి కృష్ణమూర్తి, నాయకులు సత్తిరెడ్డి, బూరుగు సత్తయ్య, నరసయ్య, లింగయ్య, పద్మారావు, అయోధ్య, సైదులు, స్వామి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

