‘నవంబర్ 3న జరిగే జాతీయవాదుల సంగమం–2026ను విజయవంతం చేయాలి’
దేశ, సమాజ పరిరక్షణ కోసం జాతీయవాద శక్తులన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల జాతీయవాద పూర్వ విద్యార్థుల కార్యనిర్వాహక సభ్యుడు, నల్లగొండ జిల్లా వాసి సాగర్ల లింగయ్య అన్నారు. నవంబర్ 3న హైదరాబాద్‌లోని...
– జాతీయవాద శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలి
– ఉస్మానియా, కాకతీయ వర్సిటీల జాతీయవాద పూర్వ విద్యార్థుల కార్యనిర్వాహక సభ్యుడు సాగర్ల లింగయ్య
రామగిరి, అక్టోబర్ 28 : దేశ, సమాజ పరిరక్షణ కోసం జాతీయవాద శక్తులన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల జాతీయవాద పూర్వ విద్యార్థుల కార్యనిర్వాహక సభ్యుడు, నల్లగొండ జిల్లా వాసి సాగర్ల లింగయ్య అన్నారు. నవంబర్ 3న హైదరాబాద్‌లోని నాగోల్‌లో గల శుభం కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న జాతీయవాదుల సంగమం–2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ హితం, సమాజ పరిరక్షణ లక్ష్యంగా జాతీయవాద భావజాలం కలిగిన వారందరూ సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
జాతీయవాదుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేయడంతో పాటు, సమాజ శ్రేయస్సు కోసం సమష్టిగా కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ సంగమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పూర్వ ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, బీజేపీ కర్ణాటక సహ ఇన్‌ఛార్జి, పూర్వ ఏబీవీపీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు. జాతీయవాద భావజాలాన్ని విశ్వసించే వారందరూ ఈ సంగమంలో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 3న జరిగే జాతీయవాదుల సంగమం–2026ను విజయవంతం చేయాలి’
అప్పాజీపేట, నర్సింగ్‌బట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
Shiva Nirvana | బాలకృష్ణతో శివ నిర్వాణ సినిమా .. మైసూర్లో కథ వినిపించిన దర్శకుడు!
మున్నూరు కాపుల జనాభా తగ్గింపుపై కుట్ర : దేవయ్య పటేల్
AP News | ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రీషెడ్యూల్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

