కోదాడ, జూలై 24 : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని కోదాడ పట్టణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు, ఆస్పత్రి సిబ్బందికి కౌన్సిలర్ చీమ నరేష్, మాజీ కౌన్సిలర్ లలిత పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు కేటీఆర్ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాహుల్, సైదులు, వెంకీ, కలకొండ వెంకటనారాయణ, కర్ల నరసయ్య, శంకర్, నాగరాజు పాల్గొన్నారు.