గ్రామాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి
దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు ముందుకు వచ్చినప్పుడు గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
- ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నల్లగొండ సిటీ, జూలై 11 : దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు ముందుకు వచ్చినప్పుడు గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండ మండలంలోని సిలార్మియాగూడెంలో గురువారం తాజా మాజీ సర్పంచ్ యర్రమాద కవితానరేందర్రెడ్డి సహకారంతో దాత యర్రమాద మురళీధర్ రెడ్డి రూ. 25లక్షలతో నిర్మించిన గ్రంథాలయం, అంగన్వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాల్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన గ్రామం కోసం సొంత నిధులతో భవనం నిర్మించడం అభినందనీయమన్నారు. సిలార్మియా గూడేనికి విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు చేస్తున్నామని, వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని మొక్కలను నాటాలని మంత్రి వెంకట్రెడ్డి కోరారు. వన మహోత్సవంలో భాగంగా తిప్పర్తి మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో కలెక్టర్ సి. నారాయణ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. వన మహోత్సవంలో ఈ సంవత్సరం 66వేల మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఆయన ముఖామఖి మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో తాగునీటి ట్యాంకును కోరగా వెంటనే మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పూర్ణ చందర్, జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీఈఓ భిక్షపతి, ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ భూమన్న, ఆర్డిఓ రవి, మాజీ జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, మాజీ ఎంపీపీ విజయలక్ష్మి, తాజా మాజీ సర్పంచ్ యర్రమాద కవితా నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

