కోదాడ, ఏప్రిల్ 04 : కోదాడ బార్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గంచే శనివారం కోర్టు ఆవరణలో ఎన్నికల అధికారి పాలేటి నాగేశ్వరరావు, సహాయ అధికారి మాధవరపు రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడు- చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు- గట్ల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి- రామిశెట్టి రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి- షేక్ జాని పాషా, లైబ్రరీ సెక్రటరీ- గాలి శ్రీనివాస నాయుడు, కోశాధికారి- కోడూరు వెంకటేశ్వరరావు, క్రీడలు & సాంస్కృతిక కార్యదర్శి- వెంకటాచలం, మహిళా ప్రతినిధి- వి. ధనలక్ష్మి, ఈసీ సభ్యులుగా షేక్ రంజాన్ బాషా, టి.సీతారామరాజు, బి.దుర్గ, పి.హేమలత, షేక్ నాగుల్ పాషా, పి.హనుమంతరావు, బి.శ్రీనివాసరావు, సి.హెచ్.పెద్దబ్బాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిలివేరు వెంకటేశ్వర్లు, పలువురు న్యాయవాదులు నూతన కార్యవర్గాన్ని శాలువా, పూల బొకేలతో అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కోర్టు భవనం త్వరితగతిన పూర్తయ్యే విధంగా కృషి చేయడంతో పాటు న్యాయవాదుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు.