కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేయాలి : పాశం గోపాల్ రెడ్డి
గుర్రంపోడు మండలంలోని తాసీల్దార్ కార్యాలయానికి వచ్చిన 32 కల్యాణలక్ష్మీ- షాదీ ముబారక్ చెక్కులను వెంటనే లబ్ధిదారులుకు అందజేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన..
గుర్రంపోడు, ఆగస్టు 26 : గుర్రంపోడు మండలంలోని తాసీల్దార్ కార్యాలయానికి వచ్చిన 32 కల్యాణలక్ష్మీ- షాదీ ముబారక్ చెక్కులను వెంటనే లబ్ధిదారులుకు అందజేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కల్యాణలక్ష్మి- షాదీ ముబారక్ పథకంపై హైకోర్టు స్టే విధించిందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతు సంక్షేమం కోసం రైతు బీమా ప్రవేశ పెట్టి అమలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం ఆగస్టు 14న గడువు ముగిసినా పునరుద్ధరణ చేయకుండా రైతులను మోసం చేసిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 22ఏ ని ఎత్తివేస్తామని చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత మరికొన్ని భూములను 22ఏ లోకి చేర్చి రైతాంగాన్ని నట్టెట ముంచిందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు రద్దు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలానికి వచ్చిన కల్యాణలక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు అందించకుంటే తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు మునుకుంట్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

