ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా జేపీఎస్, వీఆర్ఏలు
గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చాలంటే క్షేత్ర స్థాయిలో బాధ్యత కలిగిన అధికారి ఉండాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం 2019లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నోటిఫికేషన్ వేసి నియామకాలు చేపట్టింది. జిల్లాలో 844 గ్రామ పంచాయతీలు ఉండగా ఖాళీగా ఉన్న 661 గ్రామల్లో జేపీఎస్‌ల నియామకం చేపట్టింది. స్పోర్ట్స్ కోటాలోని 13 పోస్టులు మినహాయిస్తే మిగిలిన 648 పోస్టులను భర్తీ చేసింది.
- గ్రేడ్-4 కార్యదర్శులుగా జేపీఎస్‌లు, వివిధ హోదాల్లో వీఆర్ఏలకు ఉద్యోగోన్నతి
- నల్లగొండ జిల్లాలో 648 మంది జేపీఎస్‌లు, 791 మంది వీఆర్ఏలు
- ఇక ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వేతనాలు, అలవెన్స్‌లు
- సంతోషం వ్యక్తం చేస్తున్న ఆయా వర్గాలు
నల్లగొండ, ఆగస్టు 9: జూనియర్ పంచాయతీ కార్యదర్శులుతో పాటు రెవెన్యూ అసిస్టెంట్లను రెగ్యులర్ చేస్తూ అలాట్మెంట్ ఆర్డర్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. వీటిని గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అందించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో 648 జూనియర్ పంచాయ తీ కార్యదర్శులను గ్రేడ్-4 కార్యదర్శులుగా, 791 మంది వీఆర్ఏలను ఆయా హోదాల్లో పోస్టింగ్ ఇవ్వనున్నారు. ప్రొబేషనరీ పీరియడ్ నుంచి..
గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చాలంటే క్షేత్ర స్థాయిలో బాధ్యత కలిగిన అధికారి ఉండాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం 2019లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నోటిఫికేషన్ వేసి నియామకాలు చేపట్టింది. జిల్లాలో 844 గ్రామ పంచాయతీలు ఉండగా ఖాళీగా ఉన్న 661 గ్రామల్లో జేపీఎస్‌ల నియామకం చేపట్టింది. స్పోర్ట్స్ కోటాలోని 13 పోస్టులు మినహాయిస్తే మిగిలిన 648 పోస్టులను భర్తీ చేసింది. తొలి దఫాలో చేపట్టిన నియామకా ల్లో 2019 ఏప్రిల్‌లో ఫస్ట్ లిస్టులో 500 మం దిని సెలెక్ట్ చేయగా ఆ తర్వాత సెప్టెంబర్‌లో మరో ఏడు లిస్టులు పెట్టి మరో 148 మందిని తీసుకున్నారు. వీరందరిని మొదటగా ప్రొబేషనరీ పీరియడ్ పేరుతో తీసుకొని తొలుత వారికి రూ.15వేల వేతనంతో మూడండ్లే ప్రొబేషనరీ పీరియడ్‌ను పెట్టి తర్వాత 2022 ఏప్రిల్ 12న మరో ఏడాది ప్రొబేషనరీ కాలం పెంచుతూ వేతనం మా త్రం రూ.29 వేలు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం నాలుగేండ్ల సర్వీస్ పూర్తి అయిన జేపీఎస్‌లను గ్రేడ్-4 కార్యదర్శులుగా రెగ్యులర్ చేస్తూ పదోన్నతి కల్పిస్తున్న ది. పల్లె ప్రగతిలో వారి పనితీరును లెక్కించి 70 శాతం మార్కులు సాధించిన వారికి నేడు తొలివిడుతగా అలాట్ మెంట్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు.
వీఆర్ఏలకు పలు హోదాల్లో
మస్కూర్ వ్యవస్థ నుంచి వచ్చి రూ.650 వేతనంతో తాత్కాలిక ఉద్యోగులుగా పని చేసిన వీఆర్ఏలను సైతం రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ చేస్తూ ఉద్యోగోన్నతి కల్పించింది. ప్రస్తుతం వారికి రూ.11,750 వేతనం ఉండగా దానిని కనిష్ఠంగా రూ.19వేల నుంచి గరిష్ఠంగా రూ.72,800 వరకు పెంచుతూ రెగ్యులర్ చేస్తూ అలాట్మెంట్ ఉత్తర్వులు ఇస్తున్నది. జిల్లాలో 791 మంది వీఆర్ఏలు ఉండగా వారిలో 150 మంది వయసు పూర్తి కావడం, చనిపోవడం జరుగగా.. వీరి కుటుంబాల్లో అర్హులైన వారికి ఇస్తామని చెప్పిన సర్కార్ మిగిలిన 634 మందికి పలు హోదాల్లో ఉద్యోగోన్నతి కల్పిస్తూ నియామకాలు చేసింది. వారి అర్హతను బట్టి 124 మందిని జూనియర్ అసిస్టెంట్లుగా, 62 మంది మున్సిపల్ వార్డు బాయ్స్‌గా, 127 మంది రికార్డు అసిస్టెంట్లుగా నియమించిన ప్రభుత్వం 192 మందిని మిషన్ భగీరథలో, 23 మందిని ఇరిగేషన్ శాఖలో లష్కర్లుగా నియమించింది. మిగిలిన వారిని పలు శాఖల్లో సర్దుబాటు చేసింది. వీరందరికీ నేడు మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని గుండగోని మైసయ్య కన్వెన్స్హాల్లో నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. దాంతో జేపీఎస్‌లు, వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు చేసుకుంటున్నారు.
యాదాద్రి జిల్లాలో..
భువనగిరికలెక్టరేట్ : వీఆర్ఏలు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అలాట్మెంట్ ఆర్డర్స్‌ను భువనగిరిలోని రాయగిరి సోమా రాధాకృష్ణ ఫంక్షన్హాల్లో విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి గురువారం పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ టి. వినయ్‌కృష్ణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు జరిగే కార్యక్ర మానికి అధికారులు హాజరుకావాలని సూచించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

