రామగిరి, జూలై 04 : బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం నల్లగొండ జిల్లా కమిటి జిల్లా కో ఆర్డినేటర్‌గా జిల్లా కేంద్రానికి చెందిన గుండెబోయిన జానయ్య యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ ఫోరం ర్రాష్ట చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ టి.చిరంజీవులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా కమిటీలో జిల్లా చీఫ్ కోఆర్డినేటర్‌గా నేలపట్ల చంద్రశేఖర్, కోఆర్డినేటర్లుగా 9 మందిని నియమిస్తూ నియామక ప్రతాలను అందజేశారు. జానయ్య యాదవ్ నల్లగొండ జిల్లా కేంద్రంలో పలు విద్యా సంస్థలను నిర్వహిస్తూ విద్యా రంగంలో విశేష సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా జానయ్య యాదవ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా కో ఆర్డినేటర్‌గా నియమించినందుకు, బీసీల అస్తిత్వం, ఆత్మగౌరవం, రాజ్యాధికారం నినాదాలుగా స్థాపించిన బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరంలో పనిచేసే అవకాశం కల్పించినందుకు ఫోరం ర్రాష్ట చైర్మన్ టి.చిరంజీవులు ధన్యవాదాలు తెలిపారు.