కాంగ్రెస్‌లో పోరు షురూ
అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ఆస్వాదించక ముందే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో లొల్లి షురూ అయ్యింది. అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలే కీలకంగా ఉండడంతో జిల్లా రాజకీయాలు సైతం రసవత్తరంగా మారాయి.
- సీఎం కుర్చీ వివాదంలో కీలకంగా ఉమ్మడి జిల్లా సీనియర్లు
- రేవంత్‌కు వ్యతిరేకంగా ఉత్తమ్ లాబీయింగ్
- ఇప్పటివరకు ఉత్తమ్ వర్గానిదే పైచేయి
- చెరో దారిలో కోమటిరెడ్డి బ్రదర్స్
- ఉత్తమ్, వెంకట్‌రెడ్డి మధ్య అమాత్య పోరు
- రసవత్తరంగా జిల్లా కాంగ్రెస్ రాజకీయం
అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ఆస్వాదించక ముందే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో లొల్లి షురూ అయ్యింది. అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలే కీలకంగా ఉండడంతో జిల్లా రాజకీయాలు సైతం
రసవత్తరంగా మారాయి. ముఖ్యమంత్రి కుర్చీ కోసం కాంగ్రెస్‌లో తీవ్ర వివాదం నెలకొంది. ఇందులో జిల్లా నుంచి సీఎం రేస్‌లో ఉన్న ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు
రేవంత్‌రెడ్డిని సీఎం కాకుండా అడ్డుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు చర్చ సాగుతున్నది. జిల్లాలోని కీలక నేతలు సైతం రెండు వర్గాలుగా విడిపోయారు.
రేవంత్‌రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పైచేయి కోసం పట్టు బిగించారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్ చెరోవైపు మొగ్గుచూపుతుండడం ఆసక్తికరంగా మారింది. సీఎం కుర్చీ కోసం సాగుతున్న పోరులో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిలువగా, తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క టీమ్‌తో జతకట్టారు. ఉత్తమ్‌కు సీఎం ఛాన్స్ రాకపోతే జిల్లా నుంచి మంత్రులుగా ఉత్తమ్, కోమటిరెడ్డిలో ఎవరో ఒకరా.. లేదా ఇద్దరూ ఉంటారా? అనేది సస్పెన్స్‌గా మారింది.
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే వీళ్లల్లో వీళ్లే కొట్టుకోవడమే సరిపోతుంది. ఇక రాష్ర్టాన్ని ఏం పాలిస్తారని వెల్లువెత్తిన సందేహాలు ఒక్కరోజు తిరగకముందే కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన క్లియర్ మెజార్టీని రాష్ట్ర ప్రజలు కట్టబెట్టినా ముఖ్యమంత్రి ఎవరనేది వివాదస్పదంగా మారింది. పీసీపీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మధ్య సీఎం రేస్ కొనసాగుతున్నది. ఇందులోనూ రేవంత్‌రెడ్డి ఒక వైపు, మిగతా ఇద్దరూ మరోవైపు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
రేవంత్‌రెడ్డిని సీఎం గాకుండా అడ్డుకోవడమే లక్ష్యం అన్నట్లుగా ఉత్తమ్, భట్టి జతకట్టారు. రేవంత్‌రెడ్డికి, జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఎన్నికలకు ముందు నుంచే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఎన్నికల తర్వాత అది మరింత తారాస్థాయికి చేరింది. రేవంత్‌రెడ్డి పథకం ప్రకారం తానే సీఎంనన్న ప్రచారాన్ని విస్త్రతం చేసుకున్నారు. ఆదివారం ఫలితాలు వెలువడిన వెంటనే మిగతా ముఖ్య నేతలంతా ఆయా కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు రాక ముందే రేవంత్‌రెడ్డి సీఎల్పీ నేత ఎంపిక భేటీకి పావులు కదపడం ఉత్తమ్, భట్టి లాంటి వాళ్లంతా జీర్ణించుకోలేక పోయారు. ఇతర సీనియర్లు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాజగోపాల్‌రెడ్డి, పొంగులేటితో కలిసి ఉత్తమ్, భట్టిలు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా జట్టు కట్టారు.
భట్టి, ఉత్తమ్ జతగా పావులు
రేవంత్‌రెడ్డి తీరుతో రాత్రికి రాత్రే అలర్టయిన ఉత్తమ్, భట్టి సీఎల్పీ నేత ఎన్నికను సోమవారానికి వాయిదా వేయించారు. మధ్యాహ్నం ఎల్లా హోటల్లో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో సీఎల్పీ నేత ఎంపిక వ్యవహారాన్ని అధిష్ఠానానికి వదిలేసినట్లు ఏకవాఖ్య తీర్మానం చేసి ఢిల్లీకి పంపారు. దీని తర్వాతే సోమవారం సాయంత్రం సీఎల్పీ నేత ఎన్నిక, రాత్రికి సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ అనంతరం ప్రతిష్టంభన కొనసాగింది. రేవంత్‌రెడ్డికి సీఎం అయ్యే అర్హత లేదంటూ ఉత్తమ్, భట్టి విక్రమార్క అధిష్టానం వద్ద బలంగా వాదించినట్లు తెలిసింది. గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా మాత్రమే పనిచేసిన రేవంత్‌రెడ్డికి మంత్రి పదవుల లాంటి పాలనాపరమైన బాధ్యతలు నిర్వహించిన అనుభవం సైతం లేనందున నేరుగా సీఎం పదవి కట్టబెడితే పార్టీకి ఇబ్బందులు తప్పవన్న చర్చ లేవనెత్తినట్లు తెలిసింది.
ఇదే క్రమంలో రేవంత్‌రెడ్డికి మరకలా ఉన్న నోటుకు నోటు కేసును ప్రస్తావించడంతో పాటు ‘వ్యవసాయానికి 3గంటల కరెంటు చాలు… 10 హెచ్‌పీ మోటార్లు పెట్టుకుంటే సరిపోతది’… లాంటి తొందరపాటు వ్యాఖ్యలు ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం చేశాయని గుర్తు చేసినట్లు సమాచారం. వీటన్నింటి నేపథ్యంలో రేవంత్‌రెడ్డికి గాకుండా వేరెవరికైనా సీఎం పదవి ఇవ్వాలని ఉత్తమ్, భట్టి వర్గం పట్టుబట్టింది. దీంతో సోమవారం జరగాల్సిన ఎన్నిక, సీఎం ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ఈ మొత్తం పరిణామాల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక భూమిక పోషిస్తుండడం గమనార్హం.
చెరో దారిలో కోమటిరెడ్డి బ్రదర్స్
సీఎం కుర్చీ చుట్టూ నెలకొన్న ప్రతిష్టంభనలో కోమటిరెడ్డి బ్రదర్స్ చెరోవైపు నిలవడం ఆసక్తికరంగా మారింది. సీఎం కుర్చీ విషయంలో నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఆదివారం నల్లగొండ కౌంటింగ్ కేంద్రంలోనే సీఎం పదవిపై వెంకట్‌రెడ్డి మీడియాతో స్పందిస్తూ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం బాగా కష్టపడ్డారు అంటూ కితాబివ్వడంతోనే ఆయన వైఖరి స్పష్టమైంది. నల్లగొండ నుంచి నేరుగా రేవంత్‌రెడ్డి వద్దకే వెంకట్‌రెడ్డి వెళ్లడం విశేషం. ఇదే సమయంలో మునుగోడు నుంచి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాత్రం తన అన్న వెంకట్‌రెడ్డితో విభేదించారు. రేవంత్‌రెడ్డి వ్యతిరేకవర్గం ఉత్తమ్, భట్టి విక్రమార్కలతో చేతులు కలిపారు.
సోమవారం అంతా ఉత్తమ్, భట్టి, శ్రీధర్బాటు తదితర సీనియర్ నేతలతో కలిసి రాజగోపాల్‌రెడ్డి… రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదపడంలో సక్సెస్ అయ్యారు. అయితే రేవంత్‌రెడ్డి క్యాబినేట్లో మంత్రి పదవి కోసం వెంకట్‌రెడ్డి ప్రయత్నిస్తుండగా భట్టి లేదా ఉత్తమ్ సారథ్యంలో తాను జిల్లాలో కీలకంగా ఉండాలని రాజగోపాల్‌రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అన్నదమ్ములిద్దరూ చెరోవైపు అడుగులు వేస్తుండడం జిల్లా రాజకీయాలను రక్తి కట్టిస్తుంది. ఇదంతా ఇలా ఉంటే జిల్లా నుంచి తొలిసారిగా గెలుపొందిన ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు రెండోసారి గెలుపొందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ పరిణామాల్లో ఎటువైపు ఉంటారన్న దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
రెండా… ఒకటా…
ఇక ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవులు ఎన్ని దక్కవచ్చన్నది ఆసక్తికరంగా మారింది. రేవంత్‌రెడ్డి సీఎం అయితే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అమాత్యయోగం ఖాయంగానే కనిపిస్తోంది. కాగా సీఎం రేస్‌లో ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రేవంత్‌రెడ్డి క్యాబినేట్లో ఉంటాడా అన్నది కూడా సందేహాస్పదంగా మారింది. రేవంత్ టీంలో ఉండడం ఇష్టం లేకుంటే తన సతీమణి పద్మావతిని ఆ స్థానంలో కూర్చోబెడతారన్న చర్చ లేకపోలేదు. అదే మల్లు భట్టి విక్రమార్క సీఎం అయితే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమే. ఇదే సమయంలో రెండో మంత్రిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సైతం అవకాశం లేకపోలేదన్న చర్చ ఉంది. మొత్తంగా జరుగుతున్న పరిణామాలన్నీ జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

