తుంగతుర్తి, మే 15 : తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో శుక్రవారం ఉపాధి హామీ పనులను డీఆర్పీ మహిపాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలు ఉదయం వేళల్లోనే పనికి రావాలని, కొలతల ప్రకారమే కూలి డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేశారు. పనుల నిర్వహణపై కూలీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ కరుణ, మెట్ కిరణ్, చారి తదితరులు పాల్గొన్నారు.