వానల్లేక సాగని ఎవుసం
ప్రకృతి కరుణించక రైతాంగానికి మళ్లీ సాగు కష్టాలు వచ్చాయి. ఏడేండ్ల తర్వాత వర్షాల కోసం రైతులు దిగాలుగా మబ్బుల దిక్కు చూస్తున్నారు. ఇప్పటికే చెరువులు ఖాళీ కాగా భూగర్భజలాలు అడుగంటి పోయాయి.
- ఏడేండ్ల తర్వాత మళ్లీ కరువు పరిస్థితులు
- వర్షాకాలం మొదలైనా జాడలేని వరుణుడు
- చెరువులు ఖాళీ.. అడుగంటుతున్న భూగర్భ జలాలు
- ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లు ఇస్తుందనే నమ్మకం లేదు
- నీళ్లు లేక సాగర్ ఆయకట్టులో దున్నని దుక్కులు
- కాళేశ్వరం ఆయకట్టులో అడుగుకు పైనే పెరిగి ముదురుతున్న వరి నారు
- మరో పదిహేను రోజుల్లో వర్షాలు పడకపోతే అంతే సంగతులు
ప్రకృతి కరుణించక రైతాంగానికి మళ్లీ సాగు కష్టాలు వచ్చాయి. ఏడేండ్ల తర్వాత వర్షాల కోసం రైతులు దిగాలుగా మబ్బుల దిక్కు చూస్తున్నారు. ఇప్పటికే చెరువులు ఖాళీ కాగా భూగర్భజలాలు అడుగంటి పోయాయి. వానకాలం సాగు కోసం ఇప్పటికే వరినాట్లు జోరుగా సాగాల్సి ఉండగా నాగార్జునసాగర్‌లో డెడ్ స్టోరేజీ కారణంగా ఆయకట్టులో కనీసం దుక్కులు కూడా దున్నలేదు. కాళేశ్వరంపై నిందలు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సీజన్‌కు అయినా నీటి విడుదలపై ప్రకటన రాలేదు. ఇప్పటికే కాళేశ్వరం ఆయకట్టు పరిధిలో రైతులు వేసిన వరినార్లు ఫీట్ ఎత్తు పెరిగి ముదురుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం గతేడాది వానకాలం సీజన్లో జూన్ 10 నాటికి సూర్యాపేట జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తి కాగా ప్రస్తుతం 3వేల ఎకరాలకు మించి నాట్లు పడలేదు. మరో పదిహేను రోజుల్లో వర్షాలు పడకుంటే మళ్లీ కరువు తప్పదేమోననే భయాందోళనలో రైతాంగం ఉన్నది.
– సూర్యాపేట, జూలై 6 (నమస్తే తెలంగాణ)/నేరేడుచర్ల
వరుసగా ఆరేండేండ్ల పాటు నిరంతరాయంగా సూర్యాపేట జిల్లాకు ఓ పక్కన కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు, మరో పక్క నాగార్జునసాగర్ నుంచి కృష్ణా జలాలు రావడంతో రైతులు సమృద్ధిగా ఏటా రెండు పంటలు వరి పండిస్తూ వచ్చారు. జిల్లాలో దాదాపు 6.40 లక్షల ఎకరాల భూమి ఉండగా గతంలో 3.5 లక్షల ఎకరాలకు మించి సాగులో లేకుండే. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో 6.15 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. గత ఎన్నికల్లో ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి నిర్వహణ లోపం కారణంగా రైతాంగానికి గత ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి.

గత యాసంగి సీజన్లో జిల్లాలోని నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు వరి సాగు చేయగా ఒక తడికి నీటిని వదిలితే పంట చేతికి వచ్చేది. సరిపడా నీళ్లు ఉన్నా వదలక పోవడంతో పంటలు చేతికి రాకుండా చాలా వరకు ఎండిపోయాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఒకటి రెండు పిల్లర్లు కుంగాయని నీటిని దిగువకు వదిలేసి, ఆయకట్టు పరిధిలోని పరిధిలోని పంటలకు నీళ్లు ఇవ్వలేదు. దాంతో చాలా జిల్లాల్లో పంటలు ఎండిపోయాయి. ఈ వానకాలంలోనైనా సమృద్ధిగా వర్షాలు కురిసి నదీ జలాలు పారి కాలమవుతుందా లేక మళ్లీ కరువు అలుముకుంటుందా అని రైతులు మల్లగుల్లాలు పడుతున్నారు.
సాధారణం కన్నా తక్కువే..
మృగశిర కార్తెలో భారీ వర్షాలు కురుస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశే ఎదురైంది. అరుద్ర ప్రవేశించి రోజులు గడుస్తున్నా పరిస్థితిలో మార్పులేదు. ఈ సీజన్లో వర్షపాతం సాధారణం కన్నా తక్కువ నమోదైంది. కొన్ని చోట్ల చిరుజల్లులు కురవగా, ఒకటి రెండు మండలాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.
ఈ సారైనా నీళ్లు వచ్చేనా?
వానకాలం సీజన్లో ఇప్పటికే వరినాట్లు జోరందుకోవాల్సి ఉండగా వర్షాలు పడడం లేదు. నదీ జలాలపై నమ్మకం లేక నాట్లు వేయడానికి రైతులు వెనుకాడుతున్నారు. ఇప్పటికే దుక్కులు దున్ని నారుమళ్లు సిద్ధం చేసుకొని నాట్లు వేయాల్సి ఉండగా నాగార్జునసాగర్‌లో జలాలు డెడ్‌స్టోరేజీలో ఉండడంతో కొంతమేర బావులు, బోర్ల కింద వరి సాగు చేసేందుకు రైతులు రెడీ అవుతున్నారు. మెజారిటీ భూముల్లో ఇప్పటి వరకు కనీసం దుక్కులు కూడా దున్నలేదు. మరోపక్క కాళేశ్వరం నుంచి గత సీజన్‌కే నీటిని విడుదల చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సారి మాత్రం నీటిని విడుదల చేస్తుందనే నమ్మకం రైతుల్లో లేదు.
నీటి విడుదలపై ప్రభుత్వం ప్రకటన కూడా చేయలేదు. దాంతో కాళేశ్వరం ఆయకట్టు పరిధిలో దాదాపు 3.50 లక్షల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది జూలై 10 నాటికి దాదాపు 1.50 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తి కాగా ప్రస్తుతం 3వేల ఎకరాల్లో కూడా వేయకపోవడం పట్ల వరిసాగు ఎలా ఉంటుందో అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరో పదిహేను రోజులపాటు ఇలాగే కొనసాగి నాగార్జునసాగర్‌కు పైనుంచి నీళ్లు రాకున్నా, వర్షాలు కురిసి చెరువులు నిండకపోయినా, కాళేశ్వరం జలాలపై ప్రభుత్వం ప్రకటన చేయకపోయినా కరువు ఖాయం. ఇప్పటికైనా వానకాలం సాగుపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో సమీక్ష చేసి కాళేశ్వరం జలాలపై ప్రకటన చేయాలని, పంటల మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.
వానలు పడకపోతే కష్టమే
జూలై నెల వచ్చినా ఇంత వరకు సరైన వర్షం పడలేదు. భూగర్భ జలాలు పడిపోయి బోర్లు పోసే పరిస్థితి లేదు. వానలు సమృద్ధిగా పడితేనే వ్యవసాయ పనులు ముందుకు సాగుతాయి. దుక్కిదున్ని వర్షం కోసం ఎదురు చూస్తున్నాం.
-కర్నం నర్సయ్య, బక్కయ్యగూడెం, నేరేడుచర్ల
చెరువుల్లో చుక్క నీరు లేదు
వానలు పడక ఎవుసం పనులు ముందుకు పడుతలేవు. నీళ్లు లేక ఇంకా నారే పోయలే. నాటు ఎప్పుడు ఏసుడో ఏమో కానీ కాలం ఇట్లనే ఉంటే వ్యవసాయం ఈ ఏడు కష్టమే. గతంలో చెరువుల్లోనైనా నీరు ఉండేది. ఈ ఏడు చెరువులు చుక్కనీరు లేకుండా ఎండిపోయాయి. ధైర్యం చేసి పంట సాగు చేస్తే చేతికి వస్తుందో రాదోనని భయం ఉన్నది.
-లావుడ్యా శ్రీనునాయక్, పుల్గంబండ తండా, నేరేడుచర్ల
వ్యవసాయ పనుల్లేక ఖాళీగా ఉన్నాం..
వానకాలం సీజన్ కాబట్టి ఈ సమయంలో వ్యవసాయ పనుల్లో రైతులు బిజీగా ఉండే సమయం. కానీ చెరువుల్లో నీళ్లు లేవు. బోర్లు అడుగంటి పోయినయి. సాగర్ నుంచి నీళ్లు వస్తాయని నమ్మకం లేదు. దాంతో మా ప్రాంతంలో దుక్కులు దున్నకుండా భూములన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. గత సంవత్సరం ఇదే సమయంలో నాట్లు వేశాం. కానీ ఇప్పుడు పనులు లేక రైతులు ఖాళీగా ఉంటున్నారు. కాంగ్రెస్ సర్కారులో మళ్లీ పాతరోజులే వచ్చాయి. నీళ్లు, కరెంట్ కష్టాలు కనిపిస్తున్నాయి. పదేండ్ల కేసీఆర్ సర్కారులో పంటలు బాగా పండి రైతులు సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల సంక్షేమానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలి.
-రైతు పి.పుల్లయ్య, కోదాడ
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

