వసంత రుతువులో వచ్చే తొలి పండుగ హోలీ పండుగను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. వాడవాడలా చిన్నా, పెద్ద రంగులు పులుముకొని సంతోషంగా గడిపారు. డప్పుళ్లు, డీజే పాటలతో డ్యాన్స్ చేశారు. కేరింతలు కొడుతూ ర్యాలీలు తీశారు.
చిన్నారులు ఎక్కడ చూసినా బాటిళ్లలో రంగులు నింపుకొని సిరంజీలు పట్టుకొని కనిపించారు. కాలనీలు, అపార్ట్మెంట్లలో సామూహిక వేడుకలతో పండుగ వాతావరణం నెలకొన్నది. పలుచోట్ల హోలీ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని అందరిలో ఉత్సాహం నింపారు.