యాదగిరిగుట్ట, జూలై15 : నరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరి గుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం సామూహిక గిరి ప్రదర్శన నిర్వహించారు.
ఉదయం 6.05 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈఓ భాస్కర్రావుతోపాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొండచుట్టూ కాలినడక పాదయాత్ర చేపట్టారు. అనంతరం కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.