సాగుకు సమాయత్తం
వానకాలం పంటల సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. రైతులకు ఇబ్బంది లేకుండా 15 రోజుల ముందే ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతుండగా వానకాలంలో
జిల్లాలో 11.46 లక్షల ఎకరాల్లో సాగు అంచనా
గతేడాది కంటే 18 వేల ఎకరాలు అధికం
పత్తి 6.70 లక్షలు, వరి 4.63 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం
విత్తనాలు, ఎరువులు సిద్ధం చేస్తున్న యంత్రాంగం
వానకాలం పంట ప్రణాళిక రెడీ
వానకాలం పంటల సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. రైతులకు ఇబ్బంది లేకుండా 15 రోజుల ముందే ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతుండగా వానకాలంలో ఏ పంటలు ఎన్ని ఎకరాల్లో సాగవుతాయో అంచనా వేసింది. గతేడాది జిల్లాలో 11.28 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కాగా ఈ ఏడాది 11.46 లక్షలకు పెరుగవచ్చని భావిస్తున్నది. ప్రధానంగా పత్తి 6.70 లక్షలు, వరి 4.63 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో పత్తి, వరి, వేరుశనగ, పెసర, కంది తదితర విత్తనాలతోపాటు ఎరువులు అందుబాటులో ఉంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
నల్లగొండ, మే 17 : జిల్లా వ్యవసాయ యంత్రాంగం ఏరువాకకు ఏర్పాట్లు చేస్తున్నది. గతేడాది వానకాలం సీజన్లో 11,28,199 ఎకరాల్లో ఆయా పంటలు సాగు కాగా, ఈ ఏడాది 11,46,300 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. ప్రధానంగా పత్తి గతేడాది 6,53,767 ఎకరాల్లో సాగు కాగా, వరి 4,62,075 ఎకరాల్లో, కందులు 10,807 ఎకరాల్లో, వేరుశనగ 473 ఎకరాల్లో, పప్పు దినుసులు 399 ఎకరాల్లో, ఇతర పంటలు 678 ఎకరాల్లో సాగయ్యాయి. అయితే ఈ సారి వానకాలం సీజన్లో 18 వేల ఎకరాల సాగు పెరుగనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా పత్తి 6,70,800 ఎకరాల్లో సాగు చేయనుండగా, వరి 4.60 లక్షల ఎకరాల్లో, కందులు 10,800 ఎకరాల్లో, పప్పుదినుసులు 500 ఎకరాల్లో, ఇతర పంటలు 700 ఎకరాల్లో మొత్తంగా 11,28,199 ఎకరాల్లో ఆయా పంటలు సాగు కానున్నాయి.

విత్తనాలు, ఎరువులకు ఇండెంట్ పెట్టిన అధికారులు..
వానకాలం సీజన్ జూన్ రెండో పక్షంలో ఆరంభం కానుండగా ఆ లోపే రైతాంగానికి కావాల్సిన విత్తనాలు, ఎరువుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ అధికారులు ఇండెంట్ పెట్టారు. సబ్సిడీ విత్తనాలు, ఎరువులకు సంబంధించి ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టిన యంత్రాంగం ఇతర విత్తనాలకు సంబంధించి ఆయా ప్రైవేట్ కంపెనీల నుంచి తెప్పించేలా చర్యలు చేపడుతున్నారు. కందులు, పెసర, వేరుశనగతోపాటు వరికి సంబంధించి ఎంటీయూ, 1010, బీపీటీ-5204, ఆర్ఎన్ఆర్-15048, జేజీఎల్ వెరైటీలకు సంబంధించిన విత్తనాలు సబ్సిడీపై పీఏసీఎస్‌ల ద్వారా అందజేసేలా వ్యవసాయ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

వానకాలం సీజన్‌కు ఏర్పాట్లు పూర్తి
వానకాలం సీజన్‌కు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ సారి సాగు అంచనా కాస్త పెరిగి మొత్తంగా 11.46 లక్షల ఎకరాల్లో సాగు కానున్నది. ఈ సీజన్‌కు సంబంధించిన విత్తనాలు, ఎరువులు పూర్తిస్థాయిలో ముందస్తుగానే అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
– సుచరిత, జిల్లా వ్యవసాయాధికారి, నల్లగొండ

Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- aid
- farmers
- fertilizers
- Government
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

