‘పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలి’
పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్ట పరిహారం అందించాలని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా డిండి మండలం కామేపల్లి గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను ఆయన పరిశీలించి, రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డిండి ప్రాజెక్టు ఆయకట్టు రైతుల సమస్యలను...
– డిండి ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు స్థానిక ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి
– KLI ద్వారా డిండి ప్రాజెక్టును రెండుసార్లు నింపిన ఘనత బీఆర్ఎస్దే
– నీళ్ల విషయంలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేస్తోంది
– నాగార్జునసాగర్‌కు నీళ్లు రాకుండా పోతిరెడ్డిపాడుకు నీటి తరలింపుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి
– దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ, అక్టోబర్ 09 : పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్ట పరిహారం అందించాలని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా డిండి మండలం కామేపల్లి గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను ఆయన పరిశీలించి, రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డిండి ప్రాజెక్టు ఆయకట్టు రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (KLI) ద్వారా డిండి ప్రాజెక్టును రెండుసార్లు నింపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి, రైతుల పొలాలకు నీరందించేందుకు అనేక చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి రంగానికి ఇచ్చిన ప్రాధాన్యతను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడం లేదని విమర్శించారు. ప్రస్తుతం డిండి ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు రైతులు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు చేతికొచ్చే కీలక సమయంలో నీరు అందక వరి పంటలు ఎండిపోతున్నాయని, రైతులు పెట్టిన పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
రైతుల కష్టాలను గుర్తించి డిండి ప్రాజెక్టును కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా వెంటనే నింపి, ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.డిండి ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పంటలు ఎండిపోయి నష్టపోతుంటే స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని రవీంద్ర కుమార్ ప్రశ్నించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన స్థానిక ఎమ్మెల్యే, నష్టపోయిన రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి బాధిత రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని కోరారు.నాగార్జునసాగర్‌కు నీరు అందని పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించడంపై తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలని రమావత్ రవీంద్ర కుమార్ ప్రశ్నించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు అవసరమైన నీరు అందేలా చర్యలు తీసుకోవాలని, తెలంగాణ రైతుల సాగునీటి అవసరాలను పక్కనపెట్టి ఇతర ప్రాంతాలకు నీటిని తరలించడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు.ఎవరి ఆదేశాలతో పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలిస్తున్నారో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు నాయుడు వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లొంగిపోయి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. నీటి పంపకాల విషయంలో తెలంగాణ రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.తెలంగాణలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యంగా పనిచేసిందని రమావత్ రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.డిండి ప్రాజెక్టును వెంటనే నింపి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని, ఎండిపోయిన వరి పంటలకు నష్టపరిహారం అందించాలని, సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డిండి మండల అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వర్ రావు, పీఏసీఎస్ చైర్మన్ మాధవరం శ్రీనివాస్ రావు, సర్పంచులు మాల్రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, రాములు, రమావత్ వెంకట్రామ్, గొడుగు వెంకటయ్య, గిరమోని శ్రీను, మాధవరం కొండలరావు, గదర్ శ్రీను, ఇతర నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలి’
కరెంట్ లేక ఎండిపోతున్న పంటలు.. హద్నూర్ సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు
Candidates Ultimatum | టీజీపీఎస్సీకి గ్రూప్-1 అభ్యర్థుల అల్టిమేటం.. జీఆర్ఎల్ ఇవ్వకుంటే ఆమరణ దీక్ష
Narendra Modi | నోయిడాలోని జెవార్ ఎయిర్‌పోర్టుకు నరేంద్ర మోదీ పేరు.. ప్రకటించిన యూపీ సీఎం యోగి
గ్రామాల్లో ఎక్సైజ్ దాడులు.. నాటుసారా, బెల్లం పానకం పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

