కోదాడ, నవంబర్ 24 : ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని సాలార్జంగ్ పేట ఈద్గా అభివృద్ధి, లక్ష్మీపురంలో షాదీఖానా నిర్మాణం కోసం రూ.5 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పట్టణంలో సుమారు రూ.10 కోట్ల విలువైన భూమిని కేటాయించి ముస్లింలందరికీ ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ముస్లిం మైనార్టీలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ముస్లిం మైనార్టీ నాయకులు గజమాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, ఆర్డీఓ సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, తాసిల్దార్ వాజిద్, పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మైనార్టీ నాయకులు అల్తాఫ్ హుస్సేన్, షేక్ జబ్బర్, స్థానిక మాజీ కౌన్సిలర్ మదర్, మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ అహ్మద్ మౌలానా, మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు, కేఎల్ఎన్ ప్రసాద్, మునావర్, ఫయాజ్, షఫీ, షాబుద్దీన్, బాగ్దాద్, భాజాన్, శమీ, సత్యనారాయణ, సైదిబాబు, అలీ భాయ్, నజీర్, బాబా, రహీం ఖలీల్ పాల్గొన్నారు.