ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
రంజాన్ (ఈద్-ఉల్- ఫితర్) ను శనివారం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదులు, ఈద్గాల వద్ద సాముహిక ప్రార్థనలు చేశారు. నల్లగొండలోని మునుగోడు రోడ్డులో గల ఈద్గా వద్ద వేడుకలకు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరయ్యారు.
రామగిరి, మార్చి 21 : రంజాన్ (ఈద్-ఉల్- ఫితర్) ను శనివారం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదులు, ఈద్గాల వద్ద సాముహిక ప్రార్థనలు చేశారు. నల్లగొండలోని మునుగోడు రోడ్డులో గల ఈద్గా వద్ద వేడుకలకు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరయ్యారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. నిన్న జరిగిన రాష్ట్ర బడ్జెట్లో ముస్లింల సంక్షేమానికి రూ.3,500 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం జరిగిందని, దీంతో ముస్లింలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారన్నారు.

ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఈ వేడుకలో ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఏఎస్పీ రమేశ్, ఆర్డీఓ అశోక్ రెడ్డి, మాజీ మున్సిపాల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఈద్గా కమిటి నిర్వాహకుడు డాక్టర్ హఫీజ్ ఖాన్, తాసీల్దార్ పరశురాం, వివిధ డివిజన్స్ కార్పోరేటర్లు శ్రీదర్, అల్లి మల్లేశ్, అల్లి సుభాష్, మారగోని నవీన్ గౌడ్, వివిధ పార్టీల నాయకులు పుచ్చకాలయ నర్సిరెడ్డి, దండేపల్లి సత్తయ్య, ముస్లిం మత గురువు మౌలానా ఏహాసానుద్దీన్ పాల్గొన్నారు.

ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

