Chirumarthi Lingaiah | ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కురుమర్తి గ్రామంలో నీరు, విద్యుత్ సరఫరా సక్రమంగా లేక ఎండిపోతున్న పంట పొలాలను నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య పరిశీలించారు.
నల్లగొండ : నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం కురుమర్తి గ్రామంలో నీరు, విద్యుత్ సరఫరా సక్రమంగా లేక ఎండిపోతున్న పంట పొలాలను నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు సాగునీరు, విద్యుత్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
సరైన నీరు, నాణ్యమైన విద్యుత్ అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కురుమూర్తి గ్రామంలో దాదాపు 100 ఎకరాల పంటలు ఎండిపోయినట్లు స్థానిక రైతులు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ప్రస్తుతం రోజుకు కేవలం 4 నుంచి 5 గంటలు మాత్రమే విద్యుత్ అందుతోందని, కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు వాపోయారు. సరిపడా నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా మోటార్ల స్టార్టర్లు సైతం కాలిపోతున్నాయని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు 24 గంటల విద్యుత్ అందించారని రైతులు గుర్తుచేస్తున్నారని అన్నారు. తమ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులు అల్లి లింగయ్య, చంద్రకళతో పాటు పలువురు రైతులు తమ పంటలు ఎండిపోతున్నాయని, సాగు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకి వివరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్, అవసరమైన సాగునీరు అందించాలని చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే రానున్న రోజుల్లో రైతుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

