తుంగతుర్తి, జూన్ 2 : సబ్సిడీపై పంపిణీ చేస్తున్న జీలుగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి జాతీయ జెండా జెండా ఆవిష్కరించారు. అనంతరం రైతులకు జీలుగు విత్తనాలు పంపిణీ చేసి మాట్లాడారు. ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట (జీలుగ) విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మండలానికి 3 టన్నులు జీలుగ విత్తనాలు వచ్చినట్లు తెలిపారు.
30 కిలోల జీలుగ విత్తనాల బస్తా ధర రూ.4,275 ఉండగా, 50 శాతం ప్రభుత్వ సబ్సిడీ పోగా రైతు రూ. 2,137 చెల్లిస్తే సరిపోదన్నారు. మండలంలో జీలుగ విత్తనాలు అవసరం ఉన్న రైతులు తమ పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వచ్చి విత్తనాలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ ఏడీఏ బాలకృష్ణ, ఏఈఓ సృజన, సొసైటీ వైస్ చైర్మన్ మొడెం శ్రీలత, సీఈఓ వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు యాదగిరి, మజీద్, భిక్షంరెడ్డి, రామ నరసమ్మ, ఈదప్ప, యాకయ్య, రవీందర్ రెడ్డి, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.